బుడుగు: పిల్లలు పుట్టిన దగ్గర నుండి వాళ్ళ అభివృద్ధి గురించి తెలుసుకోండి.. !!

Suma Kallamadi
పిల్లలు పుట్టిన దగ్గర నుండి పెరిగే వరకు వల్ల పెరుగుదలను గమనిస్తూ ఉండాలి. అయితే చాలా మందికి పిల్లల ఎదుగుదల గురించి అసలు ఏమి తెలియదు. అసలు ఏ ఏ నెలలలో పిల్లల ఎదుగుదల అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ! పుట్టిన అప్పటి నుండి ఆరవ నెల వరకు  ఉన్న బరువు రెట్టింపు అవుతారు.కూర్చో పెట్టినప్పుడు తమ తల  నిలుపగలుగుతారు.అలాగే వేరొకరి సహాయంతో కూర్చోగలుగుతారు.తమపై అందరూ శ్రద్ధ వహించాలని నవ్వుతారు.అలాగే 6-8 నెలలు వచ్చిన తర్వాత  వారంతట వారే కూర్చోగలుగుతారు.కుతూహలాన్ని చూపించటం ఆరంభిస్తారు.అవతలి వారి పనుల్ని అనుకరిస్తారు.

బొమ్మలను నోటి దగ్గరకు తెస్తుంటారు..!




ఎవేవొ శబ్ధాలు చేస్తూ మాట్లాడటం ఆరంభిస్తారు.అప్పుడే దంతాలు  కనిపిస్తాయి.9-12నెలలు వచ్చాక  పాకటం ఆరంభిస్తారు.వస్తువుల్ని చూపించటానికి వేలు ఉపయోగిస్తారు.అమ్మ, తాత, అత్త  వంటి రెండు అక్షరాల పదాల్ని మాట్లాడ గలుగుతారు.ఏదైనా పట్టుకుని నిలబడ గలుగుతారు.వేళ్ళతో వస్తువుల్ని తీయటం ప్రారంబిస్తారు.పేరుతో  పిలిస్తే పలుకుతారు.సొంతంగా తినటం మొదలు పెడతారు.13-15 నెలలు వచ్చాక సొంతగా నిలబడతారు సహాయం లేకుండా నడవ గలుగుతారు.కొత్త వారి దగ్గర సిగ్గుపడతారు.



గిన్నెలు, చెంచాలు ఉపయోగించటం ఆరంభిస్తారు.
వివిధ ఆకృతుల్లో ఉండే పదార్థాల్ని కొరక గలుగుతారు.అలాగే పిల్లవాడికి పద్దెనిమిది నెలలు వచ్చే సరికిి పరిగెడతారువచ్చేసరికి పరిగెడతారు .చాలా పదాలను అనగలుగుతారు.సులభమైన సూచనలను పాటిస్తారు.మృధువుగా, మెత్తగా, కరకర ఉండే ఆహారాన్ని కొరకటానికి ప్రయత్నం చేస్తారు 24నెలలు వచ్చాక పడిపోకుండా పరిగెడతారు.సైకిల్ తొక్కుతారు, దూకుతారు, గెంతుతారు.రెండు లేదా నలుగు పదాలు కలిగిన  వాక్యాల్ని అనగలరు.ఆహారం కిందపడేస్తున్నప్పటికి  స్వయంగా తినగలరు.ఇవన్నీ పుట్టినప్పుడు నుండి రెండు సంవత్సరాలు వచ్చే దాక పిల్లలలో జరిగే అభివృద్ధి..మరి మీ పిల్లల్లో ఈ అభివృద్ధి ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: