బుడుగు: చిన్నపిల్లలు మట్టి తినడానికి అసలు కారణం ఇదే... !!

Suma Kallamadi
చాలామంది చిన్నపిల్లలకి మట్టి తినే అలవాటు ఉంటుంది.అసలే పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు ఏమి తినాలో తినకూడదో అన్న విషయం.. ఏది పడితే అది టక్కున నోట్లో పెట్టుసుకుని తినేస్తారు. మీకు తెలుసా చిన్నపుడు శ్రీకృష్ణుడు కూడా మన్ను తినేవాడట. చిన్ని కృష్ణుడిలాగే చిన్నపిల్లలు ఇప్పుడు కూడా మన్ను తింటున్నారు.అయితే అసలు పిల్లలు మట్టిని ఎందుకు తింటారు? తినడం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా.. అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము.. !

సాధారణంగా చిన్నపిల్లలకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి బాగా ఉంటుంది.ఏది చేయవద్దు అంటే అ పనే చేస్తారు.మనం మట్టి తినవద్దు అంటే అమ్మ ఎందుకు తినవద్దు అని ఆలోచించరు. ఏదో తినే వస్తువు అని తినేస్తారు.మట్టి వారి చేతికి ఏదో ఒక కొత్తరకం తిండిలా అనిపిస్తుందట. దానిని రుచి చూద్దాం అనేసి తినేస్తారు.కానీ ఇలా పిల్లలు మన్ను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు

 అదేంటి పురాణాల్లో  కృష్ణుడు అపుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం మట్టి తిన్నాడు కదా..!! అని కొంత మందికి డౌట్ రావచ్చు.. అయితే అప్పుడు మట్టి అంటే చాలా స్వచ్ఛంగా ఉండేది. పంటపొలాల మట్టిలో దొరికే మినరల్స్ ఇప్పుడున్న మట్టిలో దొరకడం లేదు. ఇప్పుడు నేల, నీరు, గాలి అన్ని కలుషితం అయిపోయాయి.ఇప్పుడున్న కలుషితమైన వాతావరణం, మట్టిలో కలిసిపోతున్న మెటల్స్, ప్లాస్టిక్ ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మీ పిల్లలని మట్టి తినకుండా అడ్డుకోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్న మట్టిలో మినరల్స్ కాదు, బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని మట్టికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.అలాగే మట్టిలో కూడా ఆడనివ్వకండి.. మళ్ళీ అ చేతులు నోటిలో పెట్టుకుంటే అనారోగ్యాలు వస్తాయి.. పిల్లలకి ఎప్పుడు చేతులు శుభ్రంగా నీటితో కడుక్కోవాలి అని చెప్పండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: