బుడుగు :చిన్నపిల్లల్లో కడుపునొప్పి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
చిన్నపిల్లల్ని చూస్తే చాలు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురయినా గాని పసి పాపాయి బోసి నవ్వు చూస్తే చాలు అన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటాము.వారు సంతోషంగా నవ్వుతూ ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.కానీ పిల్లలు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆపడం అంత తేలిక కాదు.అస్తమానం ఏడుస్తూ ఉంటారు.అలాంటపుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం.అందుకు చాలా ఓపిక కావాలి.వాళ్లకు వచ్చిన సమస్యను ఒకపక్క నోటితో చెప్పలేరు.ఊరికే ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులలో కడుపు నొప్పి ఒకటి. సాధారణంగా శిశువులు కడుపు నొప్పితో బాధపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.అసలు చిన్నపిల్లలకు ఎలాంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయో తెలుసుకుందాం.


చిన్నపిల్లలకు తల్లి పాలను మించిన ఆహారం మరొకటి లేదు. కానీ ఒక్కోసారి  తల్లి పాలు కాకుండా డబ్బా పాలను తాగిస్తే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు వీటిని దూరంగా పెట్టండి. మీ పిల్లలు పెరిగే కొద్ది జీర్ణ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటికీ జీర్ణ సమస్యలు తగ్గకపోతే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. కొన్ని లక్షణాల ద్వారా శిశువుకు కడుపు నొప్పి వచ్చిందని గుర్తుపట్టవచ్చు. కడుపు నొప్పి వచ్చినప్పుడు శిశువు కచ్చితంగా ఏడుపు ప్రారంభిస్తారు.అంతే కాకుండా విరేచనాలు, వాంతులు, మలబద్దకం ఇవన్నీ ఉన్న సమయంలో దీన్ని కడుపు నొప్పి యొక్క లక్షణాలుగా పరిగణించాలి.


జీర్ణ సమస్య ఉన్నప్పుడు శిశువు వెంటనే ఏడుపు ప్రారంభిస్తుంది. శిశువులకు జీర్ణవ్యవస్థ సరిగా అభివృద్ధి చెంది ఉండదు. కాబట్టి తరచుగా కడుపు నొప్పి, వాంతులు మరియు వికారం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి.పిల్లలకు పాలు పట్టించిన తర్వాత బిడ్డను ఒక్కసారి ఎత్తుకుని భుజం మీద తట్టాలి. అలా భుజం మీద వేసుకుని తట్టినపుడు బిడ్డ త్రెపాలి అలా త్రేపినపుడు బిడ్డకు గ్యాస్ సమస్యలు రావు.   అలాగే మీ శిశువుకు తల్లి పాలు కచ్చితంగా పట్టించాలి. సరైన సమయాలలో ఇస్తే మీ పిల్లవాడికి కడుపు నిండి హాయిగా నిద్ర పోతారు.
డబ్బా పాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు.  శిశువులు ముందుగా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు గాలిని గ్రహిస్తారు. ఇది పిల్లలలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. అదేవిధంగా పాలు ఇచ్చేటప్పుడు బాలింత కూడా గ్యాస్ వచ్చే ఆహారాన్ని తినకపోవడం మంచిది. తరుచూ బిడ్డ కడుపునొప్పితో ఏడుస్తుంటే డాక్టర్ ని సంప్రదించి అరుగుదలకు టానిక్ లాంటివి వాడాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: