బుడుగు: వర్షాకాలంలో పిల్లల్లో వచ్చే అనారోగ్యాలు పట్టించుకోకపోతే అంతే సంగతులు.. !!

Suma Kallamadi
చిన్నపిల్లల్లో  రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది.దీని వల్ల త్వరగా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నీళ్లు రోడ్ల మీద నిల్వ ఉండిపోతాయి.  ఫలితంగా దోమలు చేరతాయి. ఈ దోమలు పిల్లల్ని కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి. అలాగే నీటి కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది.ఈ నీటిలోనే  బాక్టీరియా,వైరస్ లు వృద్ధి చెందుతాయి.అందుకనే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే వర్షాకాలంలో చాలామంది పిల్లలకు జలుబు దగ్గు లాంటివి బాక్టీరియా లేదా వైరస్ వలన వ్యాపిస్తాయి. జలుబు దగ్గు మాములే కదా అని అశ్రద్ధ చేస్తే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దీనినే న్యుమోనియా అని అంటారు.



దీని కారణంగా ఊపిరితిత్తులలోకి నిమ్ము చేరి పిల్లలకు ప్రమాదంగా మారుతుంది. ఇలా నిమ్ము చేరకుండా ఉండాలంటే తల్లి బిడ్డకు 6 నెలల వరకు పాలు ఇస్తే మంచిది.అపరిశుభ్రత, కాలుష్యంలోని పొప్పొడి రేణువుల వలన, శ్వాసనాళాలలో అడ్డుపడి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.ఇలా ఉండే పరిస్థితినే ఆస్తమా అని అంటారు. ఆస్తమా ఉన్నప్పుడు దగ్గు కూడా ఎక్కువగా  ఉంటుంది.వర్షంలో పిల్లలను బయటకు తీసుకుని వెళ్లకపోవడమే మంచిది.


జలుబు,దగ్గు నుండి ఫ్లూ జ్వరాలు వెంటనే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలను చేరుతాయి. అలాగే ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, కలుషిత నీటిని సేవించడం వలన, దోమలు ఎక్కువగా ఉండటం కారణంగా వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వ్యాపిస్తాయి.అందుకనే పిల్లలకు కాచి చల్లార్చిన మంచినీళ్లు తాగించాలి. లేదంటే ఫిల్టర్ చేసిన నీరు అయినా తాగించాలి. పిల్లలకు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమలు పోయే క్రిమిసంహారక మందులను వాడాలి.అవి కూడా పిల్లలకు అందకుండా జాగ్రత్తగా భద్రపరచాలి.. ఇంటిలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలిి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: