బుడుగు : మీ పిల్లలకు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉందా.. !!అయితే ఇలా చేయండి.. !!!

Suma Kallamadi

చాలామంది చిన్న పిల్లల్లో మనం ఎక్కువగా గమనించే విషయం  నోట్లో  బొటన వేలు పెట్టుకోవడం. వేలు పెట్టుకుని ఉండడం అనేది చిన్నారుల్లో స‌ర్వ‌ సాధారణం. మాములుగా సంవత్సరంలోపు పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే. వారికి ఆకలిగా ఉన్నప్పుడు, ఒంటరిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు, తల్లి పాలు తాగాలనిపించినప్పుడు పిల్లలు నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈ అలవాటు తల్లి పాలు తాగే పిల్లల్లో కంటే డబ్బా పాలు తాగే పిల్లల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది.కొంతమంది నిద్రపోయేటప్పుడు కూడా నోట్లో వేలు పెట్టుకుని పడుకుంటారు.

 

 

 

 

 

మాములుగా అయితే పిల్లలు రెండు మూడు ఏళ్ళు వచ్చే సరికి తమంతట తామే ఈ అలవాటును మానేస్తారు. అయితే.. కొందరు పిల్లల్లో ఐదేళ్లు వచ్చినా ఈ అలవాటు కనిపిస్తుంది. దీనివల్ల అలాంటి పిల్లల దవడలు, దంతాల ఆకృతి మారిపోతాయి.ఇలా నోట్లో వేలు పెట్టుకునే  అలవాటు ఉన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటూ మట్టి అంటిన వేలిని నోట్లోపెట్టుకోవటంతో మట్టిలోని క్రిములు కడుపులోకి చేరి నులి పురుగులు, వాంతులు , విరోచనాలు , కడుపునొప్పి వంటి సమస్యలను ఎదుర్కుంటారు. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా పిల్లలకు ఈ అలవాటును మార్పించవచ్చు.మీ పిల్లలు నిద్రపోయే టైమ్ లో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి. సంవత్సరం నిండిన తర్వాత కూడా ఆ అలవాటు మానకపోతే వేళ్లకు ప్లాస్టర్ అంటించి దానికి ఏదైనా చేదుపదార్థం రాయండి.

 

 

 

 

 

మూడేళ్ళకూ మానకపోతే దంత వైద్యులకు చూపిస్తే వారు లోహపు ప్లేటును అమర్చుతారు. దీనివల్ల నోట్లో వేలుపెట్టుకొంటే ప్లేటులోని ముళ్లు గుచ్చుకుని నోట్లో వేలు వేసుకోరు. అలా క్రమంగా కొన్నాళ్లకు ఈ అలవాటు మానుకొంటారు.పిల్లల్లోని నైపుణ్యాన్ని తట్టిలేపి వారిని సంగీతం, సాహిత్యపఠనం, చిత్రలేఖనం వైపు ప్రోత్సహిస్తే ఆ ఆలోచనల్లో మునిగి ఈ అలవాటును త్వరగా మానుకుంటారు. మీ పిల్లల వయసుకు తగిన బొమ్మలను అందుబాటులో ఉంచటం, వేళకు ఆహారం తినిపించటం ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చు.  మీరు మీ పిల్లలను ఈ అలవాటు మానుకోమని భయపెట్టటం, కొట్టటం వంటివి అస్సలు చేయరాదు. తోటి పిల్లల ముందు అవమానంగా మాట్లాడకండి.పిల్లల మనసు నొచ్చుకుంటుంది. అలాగే చిన్నవయసులో ఈ అలవాటు మనిపించకపోతే పెద్దయ్యాక కుడా ఇదే అలవాటు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: