బుడుగు: పిల్లల్లో శక్తిని పెంచే ఆహారపదార్ధాలు ఇవే.. !!

Suma Kallamadi

 

పిల్లలు చదువుల్లో పడి తిండి తినడాన్ని  అశ్రద్ధ చేస్తున్నారు. ఫలితంగా శరీరంలో శక్తి నశించి ఊరికే అలసట పొందుతున్నారు. అందుకె  పిల్లలకు  ఎనర్జీని పెంచి, వారిని అనుక్షణం యాక్టివ్‌గా ఉంచే సూపర్‌ఫుడ్స్  కొన్ని ఉన్నాయి. టీనేజర్లది పెరిగే వయసు కాబట్టి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.  న్యూట్రియంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని సూపర్‌ఫుడ్స్‌ అంటారు. వీటిల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.పిల్లలకు రోజుకు రెండు క్యారెట్లను తింటే శరీరానికి చాలా మంచిది. ఇవి ఒక రోజులో అవసరమైన బెటా-కెరొటిన్ ను శరీరానికి అందిస్తాయి. అంతేకాదు క్యారెట్లను తినడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. 

 

 


ఆకుకూరలు రక్తపోటును తగ్గిస్తాయి. కాలిఫ్లవర్‌లో క్యాన్సర్‌పై పోరాటం చేసే గ్లూకోసినొలేట్స్‌ బాగా ఉన్నాయి. అవొకాడోలో ఇతర విటమిన్లు, ఖనిజాలతోపాటు విటమిన్‌-ఇ కూడా పుష్కలంగా ఉంది. నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, గింజలలో ఒమేగా-3 ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. దీంతో పాటు మీగడ తీసిన పాలు తాగాలి. ఫ్యాట్‌ తక్కువగా ఉన్న పెరుగు శరీరానికి మంచిది. ఇది ఎముకలకు కావాల్సిన కాల్షియంను అందిస్తుంది. పిల్లలకు నట్స్‌ ఇష్టం ఉంటే పెరుగు మీద జీడిపప్పులు, వాల్‌నట్స్‌ లాంటి నట్స్‌ చల్లి పెట్టొచ్చు. నట్స్‌లో ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం ఉంటాయి. తాజా పెరుగులో నట్స్‌ వేసుకుని తింటే మంచిది. ఉప్పు మాత్రం వాడొద్దు.ఎదిగేపిల్లలకు మామిడి పండ్ల ముక్కలు, ద్రాక్షపళ్లు ఉదయం  పెడితే చాలా మంచిది. ఇవి వారి ఆకలిని తగ్గించడమే కాదు ఫ్యాట్‌ఫుడ్‌ తినాలనే ఆలోచన వారి మనసులోకి రానివ్వదు. మామిడిపండులో పీచుపదార్థం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఒక రోజుకు సరిపడినంతగా విటమిన్‌-సి ఈ పండులో ఉంది.

 

 


వెజిటేరియన్‌ ఫుడ్‌లో చేపలో, మాంసంలో ఉన్నంత న్యూట్రియంట్లు ఉన్నాయి. ఇందులో కేలరీలు కూడా ఎక్కువగా ఉన్నాయి.చేపను తరచూ తింటే గుండెపోటు రాదు. ఇందులో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమేగా-3 పోలిఅన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంది. ఒమేగా-3 వల్ల డిప్రషన్‌ రిస్కు తగ్గుతుంది. అలాగే టొమాటోలో బిటా కెరొటెనా, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ లతో పాటు లైకొపైన్ అనే యాంటాక్సిడెంట్‌ కూడా ఉంది. ఇది గుండెజబ్బులను, క్యాన్సర్లను నియంత్రిస్తుంది. ఫ్లేవర్‌ కోసం ఈ స్నాక్‌లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్ని బ్లడ్‌ కొలెసా్ట్రల్‌ని తగ్గిస్తుంది. ఈ సూపర్‌ఫుడ్స్‌ మీ పిల్లలకు పెట్టి చూడండి...చదువులోనే కాదు ఆట, పాటలన్నింటిలో ముందుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: