బుడుగు: మీ చిన్నారులు ఇలా ఉన్నారా? అయితే వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టే!

Durga Writes

పిల్లలు ఎంత సున్నితం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సున్నితమైన మనసు ఉన్న పిల్లలకు ఏదైనా చిన్న విషాదం ఎదురైనా సరే పెద్దవారిపై కంటే ఎక్కువ ప్రభావం ఈ చిన్న పిల్లలపైనే ఉంటుంది. మనం అనుకుంటాం కానీ వారికి చాలా దగ్గర వారు ఎవరైనా దూరం అయినా లేదా ఇంట్లో బయట శారీరక మానసిక వేధింపులకు గురవుతే పిల్లలు చెప్పలేక మింగలేకా వారిని మానసికంగా కుంగతీస్తాయి. 

 

 

అలా బాధపడే పిల్లలు ఎవరిలో కలవలేరు.. ఆనందంగా ఉండలేరు.. ఎల్లప్పుడూ అనారోగ్యానికి గురికావడం ఇలా అన్ని సమస్యలు వస్తుంటాయి.. ఇలా పిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో పెద్దలు ఆ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధను చూపించాలి. వారి సమస్య ఏది అనేది కనుక్కోవాలి. వారిని తరచూ మంచి మంచి ప్రదేశాలకు తీసుకెళ్లాలి. నీకు నేను ఉన్నాను అనే భరోసాను ఇవ్వాలి. అప్పుడే పిల్లలు ఆ బాధ నుండి కొంచం కొంచం బయటపడతారు. 

 

 

ఇంకా అంతే కాదు.. తల్లితండ్రులు కూడా చిన్న పిల్లల మధ్య గొడవ పడకూడదు. ఎన్ని సమస్యలు ఉన్న ఇద్దరు శాంతంగా ఉండాలి. అప్పుడే పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవ్వరు. ఇంకా పిల్లలు చదవకపోతే కూడా ఎక్కువ కోపం తెచ్చుకోకుండా వారికీ చదువు విలువ ఏంటో చక్కగా చెప్పాలి. అప్పుడే పిల్లలు మానసిక ఒత్తిడి గురి అవ్వకుండా ఆనందంగా కస్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తారు. పిల్లలు ఆనందంగా ఉండాలి అంటే మన ప్రవర్తన ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: