బుడుగు: మీ పసిపిల్లలకి ఆకలిగా ఉందో లేదో తెలుసుకోండి ఇలా..!

Suma Kallamadi

కొత్తగా పుట్టిన పిల్లలకి ఆకలి అవుతుందని తెలుసుకోవాలంటే నూతన తల్లులకు చాలా క్లిష్టతరం అవుతుంది. పసిపిల్లలు మూత్రము వచ్చి ఏడుస్తున్నారో లేకపోతే ఆకలయ్యి ఏడుస్తున్నారో తెలుసుకోవడం కష్టం. పిల్లలు మాట్లాడకపోయినా వారు తమ బాడీ లాంగ్వేజ్ తో వారికి ఏం కావాలో చెబుతుంటారు. నూతన తల్లులే వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా మేము మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం.

 



1. మీ బిడ్డ పూర్తి మెలకువతో ఉండి గట్టిగా ఏడుస్తుంటే... అది కచ్చితంగా ఆకలేసే ఏడుస్తున్నట్టు లెక్క. అలాగే మీ బిడ్డ తన తలని అటు ఇటు వేగంగా తిప్పితూ కాళ్ళు చేతులు వెళుతూ మీ వైపు చూస్తుంటే ఆకలివేస్తుందని తెలుసుకోవాలి.

 



2. పసిపిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు నోట్లో వ్రేలు పెట్టుకుంటారు. ఒకవేళ మీ పిల్లలు కూడా అదే పని చేస్తుంటే వెంటనే ఏదో ఒకటి తినిపించండి. అలాగే పిల్లలు గట్టిగా ఏడవడం ప్రారంభించారంటే అది కచ్చితంగా ఆకలయ్యే ఏడవడం అని తెలుసుకోవాలి.

 



3. ఆకలేసిన ఇంకా ఏదైనా అనిపించినా ఏడవటం అనేది ప్రతి పిల్లలు చేసే పని కానీ ఎక్కువగా ఏడుస్తుంటే పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం శ్రేయస్కరం.

 



పైన పేర్కొనబడిన టిప్స్ లను పాటించి మీ పిల్లల ఆకలిని తీర్చండి. కొన్ని సందర్భాలలో పిల్లలకు పాలు పట్టించినా అలానే ఏడుస్తుంటారు. అటువంటప్పుడు వారిని ఇంటి ఆవరణలో తీసుకువెళ్లే బాగా ఆడించండి. పెరిగి పెద్ద అయ్యి నడిచేంతవరకు పిల్లల్ని ఒంటరిగా వదిలేయకుండా ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకోవడం తల్లుల యొక్క ముఖ్య బాధ్యత. అలాగే తీయ్యటి పదార్దాలను, ఎక్కువ సాల్టీ పదార్దాలను, షాపులలో దొరికే పానీయాలను, డబ్బా పాలను అస్సలు పట్టించకూడదు. ఎదిగే వయసులోనే బాగా పోషక విలువలు ఉన్న నాచురల్ ఆహారాన్ని పిల్లలకు అందించడం వల్ల వాళ్ళు దృఢంగా, బలంగా, తెలివిగా తయారవుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: