దయకు దొరకిన ఫలం ...

Durga
సభక్తసజిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. అతను ఓ మామూలు సిపాయిగా ఉండేవాడు. ఓ రోజు అతను తుపాకీ తీసుకొని, గుఱంమీదెక్కి అడవలో వేటకు వెళ్లాడు. ఆ దినం అతను అడవి అంతా గాలించాడు. ఒక్క జంతువు కూడా చిక్కకపోయేసరికి అతనికి విసుగు పుట్టింది. చాలా దూరంగా వెళ్లగా వెళ్లగా అతనికి ఓ జింక, జింకపిల్ల కనపడ్డాయి. సభక్తజిన్ గుర్రాన్ని ఆ జికలవైపు దౌడాయించాడు. జింకేమో పరిగెత్తి భయంకొద్దీ ఓ పొదలో దాక్కొనింది. కాని, పాపం జింకపిల్ల సభక్తజీన్ చేతికి చిక్కిపోయింది. అతను దాని నాలుగుకాళ్లు కట్టివేసి గుర్రంమీద దాన్నివేసుకుని దానితల్లి కోసం నాలుగువైపులా గాలించాడు. ఎంతవెదికినా అతనికి తల్లి జింక అగపడలేదు. నిరాశచెంది. అతను తిగుగుదోవ పట్టాడు. సభక్తజిన్ తన పిల్లను బందించి తీసుకొని పోతూండటం తల్లి జింక చూసింది. బిడ్డ మీది ప్రేమ కొద్దీ, పొదనుంచి బయటికి వచ్చింది. సభక్తజిన్ గుర్రంవెంటే పరుగెత్తసాగింది. దూరం వెళ్లిన తర్వాత, సభక్తజిన్ వెనక్కు తిరిగి చూశాడు. తనవెంబడే జింక రావడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని హృదయం కరిగి పోయింది. అతను జింకపల్ల కట్లను విప్పి దాన్ని గుర్రంమీదినుంచి కిందకి దించాడు. జింక సంతోషంతో పిల్లతో సహా చెంగు చెంగున గెంతతూ అడివిలోకి పారిపోయింది. ఆ రాత్రి సభక్తజిన్ కు ఓ కలవచ్చింది. ఓ దేవదూత కనపడి ఇలా అన్నాడు. ‘‘ సభక్తజిన్! ఈ రోజు నీవు ఓ జింకపట్ల దయ చూపించావు.  భగవంతుడు నీపనికి ప్రసన్నుడై నీపేరు చక్రవర్తుల జాబితాలోకి చేర్చాడు. నీవు ఓ రాజు తప్పకుండా సామ్రాట్టువి అవుతావు. సభక్తజిన్ కల నిజమయింది. అతను భవిష్యత్తులో చక్రవర్తి అయ్యాడు. ఓ జింక పట్ల దయ చూపినందుకు అతనికి ఈ ఫలం కలిగింది. ప్రాణులపట్ల దయ ప్రదర్శించేవారికి భగవంతుడు తప్పక ప్రసన్నుడు అవుతాడు.  నీతి : ప్రాణులపట్ల దయ చూపితే మానవుడు వరాలు గుప్పిస్తాడుభగవంతుడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: