ఇద్దరు స్నేహితులు - ఎలుగుంబంటి

Durga
 ఒక రోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణములో ఉన్న వారి బంధువుల ఇంటికి పోవుచున్నారు. అది అడవి మర్గం. దారిలో వారికి ఒక ఎలుగురబంటు కనబడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరుగెత్తుకుంటూ ఒక చెట్టువద్దకు చేరారు.  ఒకడు చెట్టుపైకి ఎక్కాడు. రెండో వానికి ఎక్కడం రావడంలేదు. పోని మిత్రుడైన సహాయం చేస్తాడేమో నంటే ముందే చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. రెండోవాడు వెంటనే ఒక ఉపయం ఆలోచించి చచ్చినవాడిలా ఆ చెట్టు క్రిందే పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటు రానే వచ్చింది. శవంలా పడుకున్న వానిని వాసన చూసి చచ్చి న శవమని ఎలుగుబంటి వెళ్లిపోయింది. ఎలుగుబంటు దూరంగా వెళ్లిపోయిన తరువాత చెట్టెక్కినవాడు దిగి పడుకున్నవాడి దగ్గరకు వచ్చి ‘మిత్రమా ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది ? అని అడిగాడు.  దానికి సమాధానంగా రెండో వాడు ‘‘ అపదలో ఉన్న మిత్రునికి సహాయ పడని వానితో స్నేహం చేయరాదు అని చెప్పింది’’ అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తల దించుకున్నాడు. ఈకథలోని నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: