పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.  ఏంటదీ?

Durga
పొడుపులు :   1. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.  2. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?  3. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.  4. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.   5. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.   6. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.  విడుపులు :   1. మొగలి పువ్వు.  2. తమలపాకు. 3. ఆబోతు మూపురం. 4. పెదవులు. 5. నిచ్చెన. 6. గొడుగు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: