దుష్టులకు దూరంగా

Durga
 ఉజ్జయినీ పట్టణానికి వెళ్ళే మార్గములో ఒక ప్రక్క పెద్ద రావి చెట్టు ఉన్నది ఆ చెట్టుపై ఒక కాకి, ఒక హంస గూళ్ళు కట్టుకుని ఉంటున్నాయి. ఎండాకాలంలో ఒక మధ్యాహ్న సమయంలో ఓ బాటసారి ఉజ్జయినీకి మార్గము గుండా పయనించాడు. ఎండ వేడికి తాళలేక అలసట చెంది రావి చెట్టు క్రిందకు చేరాడు అలసి పోయిన అతడు ఆ చెట్టు క్రిందనే సేదతీరాడు. సూర్యుడు పడమర వైపుగా క్రిందకి వాలుతున్నాడు. అతని కిరణాలు బాటసారిపై పడుతున్నాయి. హంసకి అతడిపై జాలి వేసింది. ఎండ అతనిపై పడకుండా తన రెక్కలను విప్పి సూర్యకిరణాలకు అడ్డుగా పెట్టింది. దాని వలన ఎండ పడలేదు. అతడు గాఢనిద్రలోకి జారుకున్నాడు. కాకి నిద్రపోతున్నబాటసారిని చూసి కొంటెగా బాటసారి ముఖం మీద రెట్ట వేసి వెళ్లిపోయింది. బాటసారికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసే సరికి చెట్టుకొమ్మపైన హంస కనిపించినది. అదియే తన పై రెట్ట వేసిందని కోపంతో హంసను చంపాడు మంచి బుద్ధి గల హంస దొంగబుద్ధిగల కాకితో కలసి ఉండటం వలన ప్రాణాలని కోల్పోయింది. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: