వివేకానందుడి చమత్కారం

HANUMA HANUMA
 స్వామి వివేకానంద గురించి మీకందరికీ తెలుసు కదా. మనదేశాన్ని గురించి, హిందూ మతం గొప్పతనం గురించీ ప్రపంచానికి తెలియచేశాడు. అందుకే ఆయన్ని ప్రపంచమంతా మహనీయుడిగా గౌరవిస్తోంది. అయితే, అటువంటి వ్యక్తికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అమ్మో, తలుచుకోవాలంటే భయమేస్తోందా, అయితే మీరు పప్పులో కాలేసారు. ఎందుకంటే, వివేకానందుడికి కోపం వస్తే భలే మంచి మంచి జోకులు వేస్తారు. ఒకసారి ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఉన్న భారతీయులు ఆయన కోసం ఒక మీటింగును ఏర్పాటు చేశారు. ఆ మీటింగులో మాట్లాడుతూ, భారతీయులు ఏ దేశంలో ఉన్నా, వీలైనంత వరకూ స్వదేశీ వస్తువులనే వాడాలి అని చెప్పారు. ఆ మీటింగుకు ఒక అమెరికన్ మహిళ కూడా హాజరయింది. అప్పుడు ఆమె వివేకానందుడితో స్వామి మీరు స్వదేశీ వస్తువులు వాడమని ప్రచారం చేస్తున్నారు. మరి మీరు వేసుకున్న చెప్పులు అమెరికావే కదా .. అని అడిగింది. అప్పుడు ఆయన భారతీయులకు విదేశీ వస్తువులను ఎక్కడ ఉంచాలో బాగా తెలుసమ్మా అంటూ చమత్కరించారు. అలా కోపాన్ని అదుపులో చేసుకొన్నారు కనుకనే ఆయన పూజ్యనీయుడు అయ్యాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: