బుడుగు : పిల్లలకి తల్లి తండ్రులు ఇచ్చే ఆస్థి ఏంటో తెలుసా.. !!

Suma Kallamadi
 జీవితంలో అనుకున్నది సాధించాలంటే జ్ఞానం చాలా అవసరం.అటువంటి జ్ఞానం అనేది చదవడం వల్ల వస్తుంది.అందుకే చిన్న పిల్లలకు ఈ వయసులోనే చదువు గురించిన గొప్పతనాన్ని తెలియచేయాలి.వాళ్ళకి  విద్యా పరిజ్ఞానం, రోజువారీ జీవిత అవసరాల గురించి అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదయినా ఉంది అంటే అది చదువు మాత్రమే.ఆ చదువే వల్ల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.  చదవాలి అనే ఆసక్తి చిన్న వయస్సు నుండే రావాలి.తల్లితండ్రులు కూడా పిల్లలకు చదువు మీద ఆసక్తిని పెంచాలి.చదవడం వల్ల పిల్లలకు కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలు ఎక్కువుగా చదువుతుంటే వారికి మంచి పదజాలం అలవాటవుతుంది. అంతేకాకుండా వారు రోజూ చదవడం వల్ల చాలా జ్ఞానం లభిస్తుంది. ప్రత్యేక వ్యాసాలు,  పుస్తకాలను చదవడం ద్వారా పిల్లలు వారి చుట్టూ ఉన్న పరిసరాల గురించి మరింత తెలుసుకుంటారు. అది వారికి ప్రశ్నలు అడగడానికి, సమాధానాలు తెలుసుకోవడానికి ప్రేరేపించబడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధునిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం. ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల పిల్లలు చాలా కొత్త పదాలతో పరిచయం పొందుతారు. అదనంగా వారికి ఎలాంటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయో తెలుస్తుంది. చిన్న వయస్సులోనే చదివే అలవాటును పెంచుకునే పిల్లలు మరింత వ్యక్తీకరణ కలిగి ఉంటారు.

చిన్న వయస్సు నుండే చదవడం అలవాటు చేసుకుంటే విద్యా రంగంలో అగ్రస్థానం పొందే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. నేటి పిల్లలు రేపటి పౌరులు. వారు ఈ రోజు మంచి చదవడం అలవాటు చేసుకుంటే  రేపు వారి జీవితం బాగుంటుంది.చదువుకుంటే సమాజంలో విలువ ఉంటుంది. ఒక గుర్తింపు కూడా  ఉంటుంది.చదువు విలువ గురుంచి పిల్లలకు తల్లిదండ్రులు వివరంగా చెప్పాలి.అప్పుడే పిల్లలు అర్ధం చేసుకుంటారు. ఇంకో ముఖ్య విషయం తల్లి దండ్రులు వల్ల ఇష్టాలని పిల్లలు పై రుద్దకూడదు.. వాళ్ళకి నచ్చినది చదవనివ్వండి.. వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: