ఢిల్లీ: నేతాజి మనవడి లేఖకు స్పందించని మోదీ...?

FARMANULLA SHAIK
భారత స్వాతంత్రఉద్యమంలో గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే కేవలం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ప్రస్తుతం ఆయన అస్తికల విషయంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.జపాన్‌లోని రెంకోజీ ఆలయంలోని నేతాజీ అస్థికలు భారత్ కు తెప్పించాలని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.నేతాజీ అస్థికలను రెంకోజీ ఆలయంలో ఉంచడం చాలా అవమానకరమని బోస్ అన్నారు. భారత విమోచకుడిని గౌరవించాలంటే, అతని అవశేషాలు భారత నేలను తాకాలని మేము గత మూడున్నరేళ్లుగా ప్రధానమంత్రికి లేఖలు రాస్తున్నామన్నారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం సుభాష్ చంద్రబోస్ అస్థికలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరుకుంటున్నారని బోస్ తెలిపారు.నేతాజీ మరణంపై దాదాపు 10 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జరిపిన విచారణలో ఆయన తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో 18 ఆగస్టు 1945న మరణించినట్టు స్పష్టం అవుతున్నది. ఈ నేపథ్యంలో నేతాజీ మరణంపై తప్పుడు కథనాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాల్సి ఉందని పేర్కొన్నారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేతాజీ భారత్‌కు తిరిగి రావాలనుకున్నారని, అయితే విమాన ప్రమాదంలో మరణించినందున కుదరలేదని చెప్పారు.1945 ఆగస్ట్‌లో జపాన్ లొంగిపోయిన తర్వాత జపాన్ మిలిటరీ విమానంలో తైవాన్‌ను వదిలి రష్యాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు భావిస్తున్నారు.దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకును ఘనంగా నిర్వహించుకుంటున్న టైమ్ లోనే తన తండ్రి అస్థికలను రప్పించాలని కోరారు. ఆ అస్థికలకు అధునాతన సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా బోస్ మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు సమాధానం ఇవ్వవొచ్చని వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బోస్ మనవడు తాజాగా మోడీకి లేఖ రాయడం ఆసక్తిగా మారింది. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: