ఆ పాత్రల్లో దొరికిన నల్లమందు అవశేషాలు

D.V.Aravind Chowdary
రష్యా దేశంలో ఉన్న సిధియాన్ శ్మశాన వాటికలో తవ్వకాలు జరిపిన సందర్భంలో సుమారు 2,400 ఏళ్ల కిందట గంజాయి, నల్లమందు వంటి మత్తు పదార్థాలను సేవించేందుకు వాడిన పాత్రలు బయటపడ్డాయి. అవి ఏవో మట్టి , రాగి పాత్రలు కావు బంగారం తో చేసిన పాత్రలు కావడం విశేషం. పూర్వం గిరిజన ఉత్సవాలు సందర్భంగా ఈ బంగారు పాత్రలలోనే మత్తుపదార్థాలు సేవించి ఉంటారని ఆ దేశ ఆర్కియాలజిస్టులు పేర్కొన్నారు. 




ఆ బంగారు పాత్రలను వారు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వాటిలోపల గంజాయి, నల్లమందు అవశేషాల్ని కనుగొన్నారు. ఆ పాత్రలతో పాటుగా అక్కడ పలు రకాల వస్తువులు, ఆభరణాలు సైతం దొరికాయి. వీటి గురించి వారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వారు పరిశోధనలు చేస్తున్నారు. వారి పరిశోధన ల్లో చాలా ముఖ్యమైన వివరాలు బయట పడ్డాయి. 



సింధియాన్ శ్మశాన వాటిక ను సింధియాన్ అనే గిరిజన సంచార జాతి యొక్క స్మారకార్థం నిర్మించారు. అక్కడి చరిత్రకారుల కథనం ప్రకారం సింధియాన్ ప్రజలు సంచార జాతి వారు. వీరి స్వస్థలం మధ్య ఆసియాలో ఉన్న ఇరాన్ దేశం. సుమారు 2,500 ఏళ్ల కిందట ఇరాన్ నుంచి మధ్య యురేనియన్ స్టేప్పిలలో ఉన్న అనేక ప్రాంతాల్లో వీరు వలస వచ్చారు.



సింధియాన్ ప్రజలు యుద్ధవిద్యాల్లో మంచి నైపుణ్యాలను కలిగి ఉండటం చేత వీరు అనేక యుద్ధాలు చేసి విజయం సాధించారు. యుద్ధ సమయంలో విజయాలు సాధించిన ప్రతీకగా వారు పలు ఘనమైన వేడుకలు చేసుకునే వారు. ఆ వేడుకల సమయంలోనే మత్తుపదార్థాలు స్వీకరించేవారు అంట లేదా యుద్ధాలకు ముందు తమను తాము ఉత్తేజితుల్ని చేసుకోవడం కోసం కూడా సేవించేవారు అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
 



మత్తుపదార్థాలు స్వీకరించేందుకు వారు ఈ బంగారు పాత్రలను ఉపయోగించే వారు అని అక్కడ తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్టులు మరియు వీటిని పరిశీలించిన జర్మనీ రాజధాని బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రష్యన్ చారిత్రక మరియు సాంస్కృతిక సంస్థలో పనిచేస్తున్న ఎంటన్ గాస్ అనే ఆర్కియాలజిస్టు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: