మహాత్మా గాంధీ దేశానికి మహాత్ముడు ఎలా అయ్యాడు..?

MOHAN BABU

మహాత్మాగాంధీ అలియాస్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తుంటారు. సత్యం, అహింస గాంధీ నమ్మే సిద్ధాంతాల మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము  ఆయన ఆయుధాలు. కేవలం వీటితోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశానికి స్వతంత్రం సాధించిన నాయకుల్లో ముఖ్యులయ్యారు. అటువంటి మహాత్ముని గురించి  ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత జాతిపిత మహాత్మాగాంధీ. 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీజీ అంతగా ప్రభావితం చేసిన  మరో నాయకుడు లేడెమో అంటే అతిశయోక్తే లేదు. మహాత్మాగాంధీ మాతృభాష గుజరాతి.

 రాజ్ కోట్ లోని   హైస్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. గాంధీజీ పుట్టిన రోజు అయిన అక్టోబర్ 2ను ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పిలుచుకుంటారు. గాంధీ తన తల్లిదండ్రులకు  చివరి సంతానం. ఆయనకు ఇద్దరు సోదరులు మరియు  ఒక సోదరి. గాంధీజీ ఐదేళ్లపాటు పండ్లు,గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆహార విషయంలో గాంధీజీ దశాబ్దకాలం పాటు పరిశోధన చేశారు. వెజిటేరియనిజమ్ పేరిట  ఆయన ఒక పుస్తకాన్ని రచించారు.గాంధీజీ భారత్ కు తిరిగి వచ్చాక మొదటిసారి చంపారన్ ఉద్యమంలో పాల్గొన్నారు. నీలిమందు రైతుల తరపున ఆయన పోరాటం జరిపారు. ఆ సమయంలో ఆయనను రైతులు మహాత్మా అని సంబోధించారు. స్వతంత్ర పోరాటానికి ముందే మహిళల హక్కుల కోసం  గాంధీజీ పోరాటం చేశారు.

అంటరానితనం నిర్మూలన కోసం కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీజీ నిరాహారదీక్ష చేస్తుండగా ఆయన ఫోటో తీయడానికి బ్రిటిష్ వారు  అనుమతించేవారు కాదు. ఆయన ఫోటోలు బయటికెళ్తే స్వాతంత్ర పోరాటం ఎక్కడ తీవ్రతరం అవుతుందొనని బ్రిటిష్ సామ్రాజ్యం భయపడేది. గాంధీజీ పదమూడవ యేట పెళ్లి చేసుకున్నారు. ఆయన కంటే ఆయన భార్య కస్తూర్బా ఆయన కంటే సంవత్సరం పెద్దది. అయినా వాళ్ళ దాంపత్యం 60 ఏళ్లపాటు కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: