ఐదు వేల ఏండ్ల నుంచి ఇతను బతికే ఉన్నాడా..?

MOHAN BABU
 మహాభారత కాలం ఎప్పుడో అంతమైపోతుంది. కానీ ఆ కాలానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ  జీవించి ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీంతో పాటుగా మనలో ఒకడిగా తిరుగుతున్నాడని కూడా అంటున్నారు. అయితే అతని దేహంపై మహాభారత యుద్ధానికి సంబంధించిన గుర్తులు కూడా ఇంకా ఉన్నాయని, అయితే ఆ గాయాల నుంచి నిత్యం రక్తం వస్తూనే ఉంటుంది, ఆ గాయాలను మాన్పించడం కోసం ప్రజల నుంచి నిత్యం నూనెను  తీసుకుంటూనే ఉంటాడు. ఇంకా ఏం చెబుతున్నారంటే దెబ్బల వల్ల అతని మొహం పూర్తిగా గాయాలపాలు అయిందని, ఇంకొంతమంది ఏం చెబుతున్నారంటే  అతని శరీరం చాలా విశాలంగా  ఉంటుందని  అంటున్నారు. మనం ఎంతవరకు చెప్పుకున్నది  అశ్వద్ధామ గురించి, మహాభారత కాలంలో గొప్ప యుద్ధ వీరుల్లో అశ్వద్ధామ ఒకరని చెప్పవచ్చు.

 అలాగే దుర్యోధనుడు, శకుని, ద్రౌపదిల గురించి తెలిసే ఉంటుంది. కానీ మహాభారత యుద్ధంలో అశ్వద్ధామ గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అశ్వద్ధామ మహాభారతంలో ఎలాంటి వీరుడు అంటే అతని బలంతో దాదాపు పాండవుల అందరిని పరాజితులను చేశారు. పాండవుల ఓటమిని చూసిన శ్రీకృష్ణుడు  ఎలాంటి పన్నాగం పన్నాడు అంటే దీంతో పాండవుల విజయం సాధ్యమైంది. కానీ ద్రోణాచార్య పుత్రుడు అశ్వద్ధామ ఈ రోజు కూడా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అప్పుడప్పుడు అడవుల్లో మరియు దేవాలయాల్లో మనుషులకి కనిపిస్తూనే ఉంటాడు. ఈయన తన గాయాల కోసం నూనెని, మరియు ఔషధాల అడిగినప్పుడు శంకరుని పూజ చేస్తున్నప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అయితే అశ్వద్ధామ కలియుగం అంతమయ్యేవరకు తను జీవిస్తూనే ఉంటారని అనుకుంటారు.

ఇది విన్న తర్వాత మీకందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అసలు మహాభారతకాలంలో అశ్వద్ధామకు ఏం జరిగింది. అశ్వద్ధామ ఎందుకు ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడు. అయితే మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు పాండవులకు కాకుండా కౌరవులకి సపోర్ట్ చేశాడు. కౌరవుల తరపున ద్రోణాచార్య యుద్ధం చేస్తాడు. తండ్రి లాగానే అశ్వద్ధామ కూడా కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు కంటే అతని కొడుకు ఎక్కువగా పరాక్రమవంతుడు. ఆయన యుద్ధం నైపుణ్యంతో పాండవులు దాదాపు ఓడించాడు. అలా ఇంకొద్దిసేపట్లో పాండవులు ఓడిపోతారు అదే సమయంలో కృష్ణుడు ఎలాంటి పన్నాగం పన్నాడు అంటే దాంతో పాండవులు బతికి బట్ట కట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: