చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే ...
1875 వ సంవత్సరంలో ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు సృష్టించడం జరిగింది.
1962 వ సంవత్సరంలో నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమవ్వడం జరిగింది.
1970 వ సంవత్సరంలో ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమవ్వడం జరిగింది.
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..
1899 వ సంవత్సరంలో అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్ జన్మించడం జరిగింది.
1908 వ సంవత్సరంలో రాజ్ గురు జన్మించారు. ఈయన స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు ఇంకా భగత్ సింగ్ సహచరుడు.1918 వ సంవత్సరంలో సికిందర్ భక్త్ జన్మించారు. ఈయన భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1923 వ సంవత్సరంలో హోమీ సేత్నా జన్మించారు. ఈయన భారతీయ శాస్త్ర పరిశోధకుడు.
1927 వ సంవత్సరంలో అంజలీదేవి జన్మించారు. ఈమె తెలుగు సినిమా నటీమణి.
1928 వ సంవత్సరంలో దాశరథి రంగాచార్యులు జన్మించారు. వీరు సాహితీవేత్త ఇంకా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.
1945 వ సంవత్సరంలో అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్ జన్మించారు.
1985 వ సంవత్సరంలో గీతా మాధురి జన్మించారు. ఈమె తెలుగు సినీ గాయని.
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..
1993 వ సంవత్సరంలో వెంపటి సూర్యనారాయణ మరణించారు. ఈయన ప్రజావైద్యుడు ఇంకా గాంధేయవాది.
2009 వ సంవత్సరంలో కన్నెగంటి వేంకటేశ్వరరావు మరణించారు.ఈయన మట్టి ప్రేమికుడు.ఇంకా వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యాడు.
2011వ సంవత్సరంలో బండి రాజన్ బాబు మరణించారు.ఈయన ఛాయాచిత్రకారుడు.
2015 వ సంవత్సరంలో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మరణించారు. ఈయన మాజీ శాసనసభ సభ్యుడు ఇంకా మాజీ శాసనమండలి సభ్యుడు అలాగే ఉర్దూ అకాడమీ ఛైర్మన్.
2019 వ సంవత్సరంలో అరుణ్ జైట్లీ మరణించారు. ఈయన భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.అలాగే కేంద్ర మాజీ మంత్రి