ఆగష్టు 8 : చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే...
ఇక 1942 వ సంవత్సరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, 1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది.
1969 వ సంవత్సరంలో భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ పదవిని స్వీకరంచడం జరిగింది.
2008 వ సంవత్సరంలో రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.

ఇక చరిత్రలో ఈరోజు  ప్రముఖుల జాననాలు చూసినట్లయితే...
ఇక 1870 వ సంవత్సరంలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జన్మించారు. ఈయన అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్దారు. ఇంకా వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరు.
1907 వ సంవత్సరంలో అనుముల వెంకటశేషకవి జన్మించారు. ఈయన నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని.
1921 వ సంవత్సరంలో వులిమిరి రామలింగస్వామి జన్మించారు. ఈయన పాథాలజీ ప్రొఫెసర్ గా ఇంకా డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. అలాగే డైరక్టర్ జనరల్ గా కూడా ఈయన (1979-86) ఉన్నారు.
1929 వ సంవత్సరంలో పి.యశోదారెడ్డి జన్మించారు. ఈమె ప్రముఖ రచయిత్రి ఇంకా తెలుగు అధ్యాపకురాలు.
1936 వ సంవత్సరంలో మోదుకూరి జాన్సన్ జన్మించారు. ఈయన ప్రముఖ నటులు ఇంకా తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త.
1945 వ సంవత్సరంలో నంద్యాల వరదరాజులరెడ్డి జన్మించారు. ఈయన ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ప్రముఖుల మరణాల విషయానికి వస్తే..
1987 వ సంవత్సరంలో గురజాడ రాఘవశర్మ మరణించారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధులు ఇంకా కవి అలాగే బహుగ్రంథకర్త. ఇక వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు.
1998 వ సంవత్సరంలో లాస్లో జాబో మరణించారు. వీరు హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్.
2004 వ సంవత్సరంలో పసుమర్తి కృష్ణమూర్తి మరణించారు. వీరు చలనచిత్ర నృత్యదర్శకుడు.
2010 వ సంవత్సరంలో సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ మరణించారు. వీరు స్వాతంత్ర్య సమరయోధురాలు ఇంకా సంఘసేవకురాలు.
2020 వ సంవత్సరంలో నంది ఎల్లయ్య మరణించారు. ఈయన మాజీ పార్లమెంటు సభ్యుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: