జులై 24: చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే...

Purushottham Vinay
చరిత్ర అనేది చాలా గొప్పది. కాబట్టి చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చరిత్రలో ప్రతి రోజు జరిగిన సంఘటనలు తెలుసుకోవడం చాలా వివేకం. కాబట్టి చరిత్రకి మంచి ప్రాధాన్యతని ఇవ్వాలి.ఇక చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1935 వ సంవత్సరంలో గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించడం జరిగింది.అలాగే 1958 వ సంవత్సరంలో మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమవ్వడం జరిగాయి.ఇక చరిత్రలో ఈరోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..1928 వ సంవత్సరంలో కేశూభాయి పటేల్ జన్మించారు. ఈయన గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.ఇక 1936 వ సంవత్సరంలో మొదలి నాగభూషణశర్మ జన్మించారు. ఈయన ఒక మంచి నటుడు ఇంకా దర్శకుడు అలాగే నాటకకర్త ఇంకా అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు.1976 వ సంవత్సరంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మించాడు. ఈయన సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, అలాగే మంత్రి.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..1862 వ సంవత్సరంలో మార్టిన్ వాన్ బురాన్ మరణించాడు. ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు.1899 వ సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ మరణించారు. ఈయన బ్రిటిషు సైనికాధికారి ఇంకా నీటిపారుదల ఇంజనీరు.ఇక 1970 వ సంవత్సరంలో కె.వి.రంగారెడ్డి మరణించారు. ఈయన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు.ఇక 1971 వ సంవత్సరంలో గుర్రం జాషువా మరణించారు.ఈయన ఒక ప్రముఖ తెలుగు కవి.ఇక 2000 వ సంవత్సరంలో ద్వారం భావనారాయణ రావు మరణించారు. ఈయన వయొలిన్ విద్వాంసుడు అలాగే ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు.2014 వ సంవత్సరంలో చేకూరి రామారావు మరణించారు. ఈయన తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త.2018 వ సంవత్సరంలో నిర్మలానంద మరణించారు. ఈయన తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ఇంకా ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: