
జులై 10: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు...
1856 వ సంవత్సరంలో నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. ఇక మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు.అలాగే ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు బాగా వినపడుతుంది. ఇక 1916 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి అయిన కోన ప్రభాకరరావు జన్మించారు.1920 వ సంవత్సరంలో రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జన్మించాడు.ఇక 1926 వ సంవత్సరంలో నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు అక్కిరాజు వాసుదేవరావు జన్మించాడు.ఇక 1928వ సంవత్సరంలో భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి జన్మించారు.1928 వ సంవత్సరంలో గూటాల కృష్ణమూర్తి జన్మించారు.'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవన అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ గురించి చాలా చక్కగా రాశారు.ఇక 1939 వ సంవత్సరంలో సాహితీవేత్త, విద్యావేత్త కేతు విశ్వనాథ రెడ్డి జన్మించారు.ఈయన ప్రధానంగా ఓ కథారచయిత.ఇక 1945 వ సంవత్సరంలో తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాసరావు జన్మించాడు.1949 వ సంవత్సరంలో లిటిల్ మాస్టర్ గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ జన్మించారు.