ఇక చరిత్ర అనేది చాలా విలువైనది.ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇప్పుడు ముందుకు సాగుతున్న ఈ కాలంలో మన గతంలో జరిగిన విషయాలు గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చరిత్రలో ప్రతి రోజు జరిగిన సంఘటనలు తెలుసుకోవడం వివేకం..కాబట్టి ఖచ్చితంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి.ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు చూసినట్లయితే 1875 వ సంవత్సరంలో బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.ఇక 1969వ సంవత్సరంలో భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది.
ఇక అలాగే జాననాల విషయానికి వస్తే...1866 వ సంవత్సరంలో కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందిన పానగల్ రాజా జన్మించారు.1876 వ సంవత్సరంలో విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత అయిన టేకుమళ్ళ రాజగోపాలరావు జన్మించారు.ఇక 1918 వ సంవత్సరంలో, తత్వవేత్త. ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి జన్మించారు.1920 వ సంవత్సరంలో భారత కమ్యూనిష్టు పార్టీ నేత తమ్మారెడ్డి సత్యనారాయణ జన్మించారు.1925 వ సంవత్సరంలో భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు గురుదత్ జన్మించారు.ఇక 1926 వ సంవత్సరంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇంకా మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జన్మించారు.
ఇక 1927 వ సంవత్సరంలో గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు జన్మించారు.1938 వ సంవత్సరంలో హిందీ చలనచిత్ర నటుడు. సంజీవ్ కుమార్ జన్మించారు.1958 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ జన్మించారు.ఇక 1966 వ సంవత్సరంలో సినీ గాయకుడు ఉన్నికృష్ణన్ జన్మించారు.ఇక 1969 వ సంవత్సరంలో భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతి రాజు జన్మించారు.1970 వ సంవత్సరంలో గాయని అనురాధ శ్రీరామ్ జన్మించారు.ఇక 1979 వ సంవత్సరంలో షేక్ బాషుమియా జన్మించారు. ఈయన సిపిఐ వరంగల్ నగర కార్యదర్శి ఇంకా రాష్ట్ర సమితి సభ్యులు.