జూన్ 12వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi

ప్ర‌తి ఏడాదిలో ఉన్న అనేక తేదీల‌కు ఆరోజు ఎన్నో ప్రాముఖ్య‌త‌లు, విశేషాలు ఉండ‌టం కామ‌న్‌. ఆ తేదీలు ఎన్నో ప్ర‌ముఖ‌మైన సంఘ‌ట‌న‌ల‌కు సాక్ష్యంగా నిలుస్తాయి. ఖ‌చ్చితంగా ఆ తేదీ నాడు ఏదో ఒక ప్రాముఖ్య‌మైన స‌న్నివేశం జ‌రిగి ఉంటుంది. అలాంటి వాటిని మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకుంటాం. ఇక చరిత్ర‌లో ఈరోజు జూన్ 12కి చాలా ప్రాముఖ్య‌త ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నంచేద్దాం.
♥ జననాలు ♥
✦  1902: స్వాతంత్య్ర సమరయోధురాలు అయిన పాలకోడేటి శ్యామలాంబ (మ.1953) జ‌న్మించారు. ఈమె సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది.
✦  1930: సినీ గీత రచయిత అయిన ఆచ్చి వేణుగోపాలాచార్యులు(మ.2016) జ‌న్మించారు.
✦  1935: మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు అయిన తిరుమాని సత్యలింగ నాయకర్ (మ.2016) ఈరోజు జ‌న్మించారు.
✦  1975: తెలుగు నటుడు, తెలుగు చలన చిత్ర ప్ర‌ముఖ దర్శకుడు, టి. కృష్ణ కుమారుడు అయిన తొట్టెంపూడి గోపీచంద్ ఈ రోజు జ‌న్మించారు.
 
♡ మరణాలు ♡
✦ 1999: ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు  (జ.1921) ఈరోజు మ‌ర‌ణించారు. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా పేరొందాడు.
✦ 2002: రచయిత, చిత్రకారుడు అయిన చలసాని ప్రసాదరావు(జ.1939) మ‌ర‌ణించారు.
✦ 2017:   సినీ గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయిన సింగిరెడ్డి నారాయణరెడ్డి(జ.1931) జ‌న్మించారు.
✷ పండుగలు , జాతీయ దినాలు ✷
✦  ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

✷ సంఘటనలు ✷
✦  1898: స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్య్రం ఈరోజు క‌లిగింది.
✦  1964: ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించడం జ‌రిగింది.
✦  1987: కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్కు ఈరోజు సవాల్ విసిరాడు.
✦  1987: 13 ఏండ్లుగా క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష ఈరోజు విధించబడింది.
✦  1996: భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా ఈరోజు పదవిని స్వీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: