జూన్ 11వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?
♥ జననాలు ♥
✦ 1924: భారతీయ ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత అయిన అబు అబ్రహాం(మ.2002) జన్మించారు.
✦ 1932: నాట్యావధాని అయిన ధారా రామనాథశాస్త్రి(మ.2016) ఈ రోజు జన్మించారు.
✦ 1944: భారత పార్లమెంటు సభ్యుడు అయిన మేకపాటి రాజమోహన రెడ్డి జన్మించారు. ఈయన 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచారు.
✦ 1947: బీహార్ రాజకీయ నాయకుడు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు జన్మించారు.
♡ మరణాలు ♡
✦ 1963: దక్షిణ వియత్నాం కు చెందిన బౌద్ధ భిక్షువు టాయ్ క్వాంగ్ డుచ్ ఈరోజు మరణించారు.
✦ 1979: హాలీవుడ్ నటుడు అయిన జాన్ వెయిన్(జ.1907) ఈరోజు మరణించారు.
✦ 1983: భారత పారిశ్రామిక వేత్త అయిన ఘనశ్యాం దాస్ బిర్లా(జ.1894) మరణించారు.
✦ 1987: భౌతిక శాస్త్రవేత్త అయిన బి.ఎస్.మాధవరావు (జ.1900) మరణించారు.
✷ సంఘటనలు ✷
✦ 1866: ప్రస్తుతం ఉన్న అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది ఈరోజు.
✦ 1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు చూపించడం జరిగింది.
✦ 1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న దారుణమైన దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా కాలిపోయాడు.
✦ 1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో ఈ రోజు నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
✦ 1988: ఐ.ఎన్.ఎస్ సింధువీర్ (జలాంతర్గామి పేరు) ఈరోజు భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
✦ 1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఈరోజు ఉపయోగించడంతో చెలామణిలోకి వచ్చింది.
✦ 1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషనును ఈరోజు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.
✦ 2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు ఈ రోజు మరణశిక్ష అమలుపరిచారు.
✦ 2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.