జూన్ 3వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
సంవ‌త్సంరంలోని క్యాలెండ‌ర్‌ లోని ప్ర‌తి రోజుకు ఒక ప్రాముఖ్య‌త ఉంది. చ‌రిత్ర‌లో ఈ రోజుకు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరుగా చెప్పాలి. ఈ రోజు ప్ర‌పంచంలో అనేక అద్భుతాలు, కొన్ని విషాద పూరిత ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఎంద‌రో మ‌హానుభావులు జ‌న్మించారు. మ‌రెన్నో విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అలాంటివి ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
♥ జననాలు ♥
✦ 1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)
✦ 1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.

✦ 1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.
 
✦ 1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).

✦ 1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.

✦ 1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు.
 
✦ 1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

✦ 1966: రాధ, భారతీయ సినీనటి.
 
✦ 1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

♡ మరణాలు ♡
✦ 1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)

✦ 1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)

✦  2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
✦  2007: రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.
✦   2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
✦  2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)
✦   2019: బి.కె.బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921)

✷ పండుగలు , జాతీయ దినాలు✷
✦ ప్రపంచ సైకిల్ దినోత్సవం
 
✷ సంఘటనలు ✷
✦ 1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు.
✦ 1962: ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
✦ 1984 : అమృత్‌సర్ లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది. అప్ప‌ట్లో ఇది పెద్ద సంచ‌ల‌నం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: