మే 25వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?
ప్రముఖుల జననాలు:
1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)
1886 - రాష్ బిహారీ బోస్, భారత సైనికుడు, కార్యకర్త (మ .1945)
1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)
1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).
1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్ (మ .2013)
1940: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)
1954 - మురళీ, భారతీయ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త (మ .2009)
1972 - కరణ్ జోహార్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్
1977: కార్తీ, తమిళ, తెలుగు నటుడు.
1985: లియాటి జోసెఫ్ అనోయి(రోమన్ రైన్స్) అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, మాజీ ప్రొఫెషనల్ గ్రిడిరోన్ ఫుట్‌బాల్ ఆటగాడు.
ప్రముఖుల మరణాలు:
1924: అశుతోష్ ముఖర్జీ, శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
1964: గాలి పెంచల నరసింహారావు, చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ. 1903)
1989: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)
2005: సునీల్ దత్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త (జ .1929)
2005: ఇస్మాయిల్ మర్చంట్, భారతీయ సంతతి చిత్ర నిర్మాత, దర్శకుడు (జ .1936)
2013: మహేంద్ర కర్మ, భారత రాజకీయవేత్త (జ. 1950)
2013: నంద్ కుమార్ పటేల్, భారత రాజకీయ నాయకుడు (జ. 1953)
2018: కడువెట్టి గురు, భారత రాజకీయ నాయకుడు, వీర వన్నియార్ కుల నాయకుడు (జ .1961)
సంఘటనలు:
1979: అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 191 చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో, విమానంలో ఉన్న మొత్తం 271 మంది, గ్రౌండ్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు.
2013: ఛత్తీస్‌గడ్ లో భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుల కాన్వాయ్‌పై మావోయిస్టు తిరుగుబాటుదారులు దాడి చేసి కనీసం 28 మందిని చంపి, 32 మంది గాయపర్చారు.
2020: మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు హత్య చేయబడ్డాడు. అరెస్టు సమయంలో జార్జ్ ని 9 నిమిషాల కంటే ఎక్కువసేపు నెలకు అదిమిపట్టి, మెడను మోకాలితో నొక్కిపట్టి కూర్చోని ఓ యునైటెడ్ స్టేట్స్ పోలీసు అధికారి చంపేశాడు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
జాతీయ దినాలు:
అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం