చరిత్రలో మే 24 ప్రత్యేకత ఏంటో తెలుసా?

Purushottham Vinay
చరిత్రలో ఈ రోజుకి వున్న ప్రత్యేకత గురించి తెలుసుకోండి..

ప్రముఖుల సంఘటనలు...
1689: ఇంగ్లాండ్ పార్లమెంట్ ప్రొటెస్టెంట్లకి మతస్వేచ్ఛ గురించి హామీ ఇచ్చింది.
1726: సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు.
1815: ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.
1830: అమెరికాలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ప్రయాణించింది (బాల్టిమోర్, ఎల్లియట్స్ మిల్, మేరీలాండ్)
1844: మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
1862: లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు.
1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.
1899: మొట్టమొదటి 'ఆటో రిపేర్ షాపు' బోస్టన్ లో మొదలుపెట్టారు.
1902: బ్రిటన్ లో మొట్టమొదటి సారిగా 'ఎంపైర్ డే' జరుపుకున్నారు.1959లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు.
1915: థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.
1916: ఆఖరి 'బ్రిటిష్-ఇండియన్ కాంట్రాక్టు' పనివాళ్ళు సురినాంకి వచ్ఛారు.
1921: ఉత్తర ఐర్లాండ్ తన మొదటి పార్లమెంట్ ని ఎన్నుకొంది.
1922: నెదర్లాండ్స్ లో 1922 'మే' నెలలో చాలా ఎక్కువ వేడి (అత్యధిక ఉష్ణోగ్రత) నమోదైంది (35.6 °C సెంటిగ్రేడ్).
1926: 3000 మీటర్ల పరుగు పందెంలో ' పావొ నుర్మి' 8:25.4 (8నిమిషముల 25.4 సెకన్లు) సమయంలో పరిగెట్టి, సరికొత్త రికార్డు స్థాపించాడు.
1930: ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా కు, ఒంటరిగా, 'అమీ జాన్సన్' అనే మహిళ విమానంలో ప్రయాణించింది.
1930: బ్రాడ్‌మాన్ 290 నిమిషాలలో, 29 ఫోర్స్ (నాలుగులు) లలో 252 పరుగులు సాధించాడు (ఆస్ట్రేలియా వెర్సస్ 'సర్రీ' )
1931: మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో రైలు మార్గంలో)
1941: హెచ్.ఎమ్.ఎస్. హుడ్, అనే బ్రిటిష్ యుద్ధనౌకను జర్మనీ యుద్ధనౌక డి.కె.ఎమ్. 'బిస్మార్క్' ముంచివేసింది. 1416 మంది మరణించారు.బ్రతికి బట్ట కట్టిన వారు ముగ్గురే ముగ్గురు.
1951: అమెరికా 'ఎన్వెటక్' అనేచోట వాతావరణంలో 'అణుపాటవపరీక్ష' ను చేసింది.
1954: భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం).
1954: జర్మన్ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పుట్టిన రోజు.
1954: ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఒక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది.
1957: తైవాన్ లోని 'తైపే' లో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు.

ప్రముఖుల జననాలు....
0015: జూలియస్ సీజర్, జెర్మానికస్, రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019).
1686: 'డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్' అతి కచ్చితంగా వేడిని కొలిచే 'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని కనుగొన్నాడు.
1709 లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).
1819: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).
1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
1933: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014)

ప్రముఖుల మరణాలు...
1543: నికొలస్ కోపర్నికస్, ఖగోళ పరిశోధకుడు, పోలాండ్లో మరణించాడు.
1997: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931)
2013: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928)

జాతీయ దినాలు...
కామన్వెల్త్ దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: