వికీపిడీయా ఆ స్థాయికి చేరిన రోజు ఇది... మీరూ తెలుసుకోండి
ముఖ్య సంఘటనలు
1886: న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు.
2008 - తెలుగు వికీపీడియా 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.
ప్రముఖుల జననాలు
1828 హెన్రీ డునాంట్, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ (ఐసీఆర్సీ) స్థాపకుడు, మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
1899: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత
1929: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (మ.2017)
1946: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (మ.2020). 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.1997లో ప్రేమించుకుందాం రా అనే సినిమా ద్వారా మరో అవకాశం కల్పించగా, ఆ చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత 1999లో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. బదిలీలతో అనంతపురం, కర్నూలు, కడప, ప్రొద్దుటూరులలో చదువుకోవడం, గుంటూరు, నల్లగొండలో నివసించడం వల్ల రాయలసీమ, నెల్లూరు, శ్రీకాకుళం, కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలపై ఇతనికి పట్టు వచ్చింది.
ప్రముఖుల మరణాలు
1794: ఆంటోనీ లావోయిజర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (జ.1793)
1973: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1887)
1987: టి. కృష్ణ, తెలుగు చలనచిత్ర ఎడిటర్, దర్శకుడు, ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
ముఖ్యమైన పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం