ఫిబ్రవరి 10వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
ప్రముఖుల మరణాలు
1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) - (జననం.1845). విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - 1923 ఫిబ్రవరి 10) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు (రేడియోగ్రఫీ), రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త. ఈయన కనుగొన్న ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనే కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. 1895 నవంబరు 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందాడు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.
2019: చింతల కనకారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)కనకారెడ్డి 1951, ఫిబ్రవరి 10న ముత్యంరెడ్డి, సత్తెమ్మ దంపతులకు అల్వాల్‌లో జన్మించాడు. 2005 నుంచి ఏపీ గ్రేప్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కొనసాగాడు. కనకారెడ్డికి భార్య ప్రమీల, కుమారులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, కూతురు షాలిని ఉన్నారు. కోడలు శాంతి శ్రీనివాస్‌రెడ్డి అల్వాల్ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసింది.2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ తరపున మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.