ఈరోజు అందుకే ప్ర‌పంచ దేశాల‌కు అంత ప్ర‌త్యేక‌త‌.... ఫిబ్ర‌వ‌రి 9న ఏం జ‌రిగిందో తెలుసా...?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 9వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
2008 - ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసే అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
1969 - జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది

ప్ర‌ముఖుల  జననాలు
1773: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1910: ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
1919: ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
1922: రావిపూడి వెంకటాద్రి, హేతువాది మాసపత్రిక సంపాదకుడు.ఎమ్.ఎన్. రాయ్ భావాలకు ఆకర్షితులై ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి ర్యాడికల్ హ్యూమనిస్టు ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. 1949లో భారత హేతువాద సంఘం ఏర్పాటైంది. ఆ సంఘం స్థాపన నుంచి వెంకటాద్రి అందులో సభ్యులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం లో 1989 వరకు ఆ సంస్థ అధ్యక్షులుగా పనిచేశారు.1982నుంచీ 'హేతువాది' అనే మాసపత్రిక నడిపారు. 1988,1996ల్లో కవిరాజు త్రిపురనేని అవార్డు పొందారు. 1992లో తాపీ ధర్మారావు అవార్డును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకొన్నారు.
1936: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు.
1936: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013)
1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011)
1975: సుమంత్, తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు.
ప్ర‌ముఖుల మరణాలు

1881: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల రచయిత.. (జ.1821)
1932: దొంతులమ్మ, ఆంధ్ర యోగిని, అవధూత.
1996: వీణాపాణి చిట్టిబాబు, సంగీతజ్ఞుడు. (జ.1936)
2008: మురళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914)
2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
2016: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
2017: టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: