న‌వంబ‌ర్ 28వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 28వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ప్ర‌ముఖుల జ‌న‌నాలు..

1784: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939)తెలుగు, ఆంగ్ల భాషల్లోనే కాక ఇతర భాషల్లో నిష్ణాతులైనా సుబ్బారావు పంతులు వ్యాకరణ రచనలు, అనువాదాలు, స్వీయచరిత్ర రచన వంటివి సాగించాడు. ఆంగ్లభాషలో నిష్ణాతుడైన వెన్నెలకంటి సుబ్బారావు తన స్వీయచరిత్రను రాసుకున్నాడు. డైరీలు కూడా రాసుకోని సుబ్బారావు స్వీయచరిత్రలో వివరాలన్నీ పూసగుచ్చినట్టు తారీఖులతో సహా రాసుకోవడం విశేషం.120పేజీలు ఉన్న ఈ స్వీయచరిత్రను అతని కుమారుడు తిరువళ్ళూరు జిల్లా మున్సిఫ్ గా పనిచేసిన వెన్నెలకంటి గోపాలరావు 1873లో మద్రాసు ఫాస్టర్ ప్రెస్లో ముద్రించాడు.
1820: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895)
1922: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983)
1927: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008)1927, నవంబర్ 28 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత పొందిన సేథీకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసా పత్రం అందజేశారు. 1981లో సామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది. పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు, దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పి.కె.సేథీ 2008, జనవరి 7న జైపూర్లో మరణించారు.
1928: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994)
1948: వేముల మోహనరావు, రంగస్థల కళాకారుడు.


ప్ర‌ముఖుల మరణాలు

1890: జ్యోతిరావ్ పూలే, (జ.1827)
1954: ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు
2011: అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల రచయిత. (జ.1931)
2011: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: