నవంబర్ 27వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం..విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.
1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.
ప్రముఖుల జననాలు
1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)
1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)
1907: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)
1919: కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017)
1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1940: బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973)
1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి
1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి.
1953: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.
1975: సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి.
1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
ప్రముఖుల మరణాలు
1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)ఈయన పూర్వీకులది కృష్ణా జిల్లా నాదెళ్ల గ్రామం. ఈయన దివితాలూకా సీతారామపురం అగ్రహారంలో 1863, ఏప్రిల్ 23న జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బాంబిక, కామేశ్వరశాస్త్రి. 1864లో ఉప్పెనకు గ్రామం కొట్టకుపోగా ఈయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఇక్కడ హిందీ, పారశీక భాషలు నేర్చుకున్నాడు. తొమ్మిదవ ఏటనే పితృవియోగం కలిగినందువల్ల నాదెళ్ల హైదరాబాదు నుంచి తిరిగి వచ్చి సీతారామపురంలో స్థిరపడ్డారు. తరువాత బందరు హిందూ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం కొంతకాలం ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. బందరు నేషనల్ థియేట్రికల్ సొసైటీ కోరిక మేరకు హిందుస్తానీలో నాటకాలు రాసి ఇచ్చారు.
1939: చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881)
1974: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
1993: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914)
2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)
2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)