న‌వంబ‌ర్ 21వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 21వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.
1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.

జననాలు
1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)
1854: పోప్ బెనెడిక్ట్  ప‌దిహేన‌వ‌, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.హెలెన్ జైరాజ్ రిచర్డ్‌సన్ హిందీ సినిమాలలో నటించిన నటీమణి, నర్తకీమణి. ఈమె తండ్రి ఆంగ్లో ఇండియన్. ఆర్మీలో పనిచేశాడు. తల్లి బర్మాదేశస్థురాలు. నర్సుగా పనిచేసింది. హెలెన్ 1939, నవంబర్ 21న బర్మాలో జన్మించింది. ఈమె తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించాడు. బర్మాపై జపాన్ దండెత్తిన సందర్భంలో 1942లో ఈమె కుటుంబం భారతదేశానికి కాందిశీకులుగా వలస వచ్చింది. ఈమె 700లకు పైగా చిత్రాలలో నటించింది. ఈమె 1981లో హిందీ చిత్ర రచయిత సలీంఖాన్‌ను వివాహం చేసుకుంది. ప్రఖ్యాత హిందీ సినిమా హీరో సల్మాన్ ఖాన్‌కు ఈమె సవతి తల్లి. ఈమె జీవితాన్ని ఆధారం చేసుకుని నాలుగు సినిమాలు, ఒక పుస్తకం వెలువడింది. ఈమె హిందీ సినిమాలతో పాటు దక్షిణాది భాషా చిత్రాలలో కూడా నాట్యం చేసింది. ఈమెకు 1999లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 2009లో భారత ప్రభుత్వం వారిచే పద్మశ్రీ పురస్కారం లభించాయి.
1989: లక్ష్మీ సౌజన్య, సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

మరణాలు
1952: బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902)
1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888)
1996: అబ్దుస్ సలామ్, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926)
2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)

పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ మత్స్య దినోత్సవం
ప్రపంచ టెలివిజన్ దినం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: