నవంబర్ 18వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1493: క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.
1963: మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
1972: భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.
ప్రముఖుల జననాలు..
1888: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957).దుర్భాక రాజశేఖర శతావధాని వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రితో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
1901: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (మ.1990)
1924: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత.
1945: మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.
1946: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.
1972: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.
ప్రముఖుల మరణాలు
1962: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885)నీల్స్ బోర్ డెన్మార్క్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. నీల్స్ బోర్ 1885 అక్టోబరు 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు. నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభను కనబరిచాడు తండ్రి అక్కడి విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్.
1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904)
1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)