అక్టోబ‌ర్ 26వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 26వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ప్ర‌ముఖుల జ‌ననాలు..
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు.నయాగరాకవులలో ఒకరుగా ప్రసిద్ధులయిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం ఆగష్టు 25, 1920. తండ్రి రామయ్య. తల్లి సుబ్బాయమ్మ. ప్రముఖ వేణుగాన కళావిద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు వీరి సోదరులు. ఏల్చూరి మురళీధరరావు వీరి కుమారుడు. సహజకవిగా, మహావక్తగా, ఉద్యమప్రవక్తగా, అజాతశత్రువుగా, అఖిలాంధ్ర కవిలోకానికి ఆత్మీయ మిత్రునిగా మెలగారు.
1932: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప.
1949 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.1949, అక్టోబరు 26 న నిసార్ అహ్మద్ కక్రూ జన్మించారు. 1975 లో ప్లీడర్ గా, వకీలుగా 1979 లో, అడ్వకేట్ గా 1982 లో నమోదు అయి జిల్లా, సెషన్స్ కోర్టు, ఇతర కోర్టులలో న్యాయవాది అనుభవం గడించాడు. ప్రభుత్వ న్యాయవాదిగా 197 8లో జిల్లా, సెషన్స్ కోర్టు, బారాముల్లాలో నియమించబడ్డాడు. 1981 లో ప్రభుత్వ న్యాయవాదులు స్వంత ప్రాక్టీసుకి వ్యతిరేఖంగా ప్రభుత్వ ఉత్తర్వు ఇచ్చినప్పుడు రాజీనామా చేశాడు.1984లో ప్రధాన న్యాయస్థానము, జమ్ము, కాష్మీర్ లో పౌర, నేర, రాజ్యాంగ, సేవ, కార్మిక, కంపెనీ వ్యవహారాల్లో, అనుభవంగడించాడు. ఫిభ్రవరి1988 నుండి డిసెంబరు 1990 వరకు ప్రధాన ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. ఆ తరువాత మరల స్వంత ప్రాక్టీసు కొనసాగించి, నవంబరు 1997లో హైకోర్టు ధర్మాసనం సభ్యుడిగా నియమించబడ్డాడు. స్థానాపన్న ప్రధాన నాయమూర్తిగా చాలా సార్లు పనిచేసాడు. పదోన్నతి పై 2010 పిభ్రవరి, 19న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా నియమించబడ్డాడు. పదవీవిరమణ నిబంధనలప్రకారం, 62సంవత్సరాల వయస్సులో 25.10.2011 న పదవీవిరమణ చేశాడు
1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం,, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు. నాగూర్ బాబు సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవాడు. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. ఇళయరాజా ఆయన పేరును మనోగా మార్చాడు.
మనో అన్నయ్య తబలా వాద్యకారుడు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు. తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా ఆయన ఇప్పటికిపాతిక వేల పాటలు పాడారు. గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లోది. రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం చేసి ఆయన మెప్పు పొందాడు. బుల్లితెర పై పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.
1985:ఆసిన్, ఆసిన్ అని పేరుతో పిలవబడే ఈమె కేరళ రాష్ట్రం నుండి వచ్చిన ఒక భారతీయ చిత్ర నటి.
1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
మరణాలు
1955 : ప్రసిద్ధ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: