అక్టోబ‌ర్ 6వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 6వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1927: ది జాజ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు. ఒకటి, రెండు పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి.
1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది.

జననాలు

1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978)వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసేవాడు.
1908: ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. గణేశన్ వెంకటరామన్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, రచయిత. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ  ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్  లకు ఫెలోషిప్‌కు ఎంపికయ్యాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్, సర్ సి.వి.రామన్ ప్రైజ్, ఇందిరాగాంధీ ప్రైజ్ లను అందుకున్నాడు. 1991లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.
1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
1946: వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017)
1958: పనబాక లక్ష్మి, భారత పార్లమెంటు సభ్యురాలు.


మ‌ర‌ణాలు

1892: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)
1967: సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898)
2012: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1927)
2014: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930)


పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ గృహ వసతి దినం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: