సెప్టెంబర్ 24వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
ప్రముఖుల జననాలు
1921: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007) తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్.ఆర్, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు.
1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006)ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం) యొక్క పాలిట్బ్యూరో సభ్యుడు.
1931: మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.
1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
1950: మోహిందర్ అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోకసభ సభ్యుడు.
1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1972: శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు.
ప్రముఖుల మరణాలు
1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908)
2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929)
2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929)
2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ హృదయ దినోత్సవం.
ప్రపంచ నదుల దినోత్సవం.
ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం.