
చరిత్రలో ఈరోజు : 24-02-2020 రోజున ఏం జరిగిందంటే..?
ఫిబ్రవరి 24వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి ఈ రోజు చరిత్రలో కి వెళ్లి చూసి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి: 1982 ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ 8వ ముఖ్యమంత్రి గా టంగుటూరి అంజయ్య పదవీ విరమణ చేశారు ఇక అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర9వ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకరం చేశారు.
పిలకా గణపతిశాస్త్రి జననం : కవి వ్యాఖ్యాత నవల రచయిత అనువాదకుడు అయిన పిలకా గణపతి శాస్త్రి 1911 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించారు. ఈయన ఆస్థాన విద్వాంసుడు పత్రిక సంపాదకుడు కూడా. 1983 సంవత్సరంలో ఈయన పరమపదించారు
జాయ్ ముఖర్జీ జనం : భారతీయ ప్రముఖ చలనచిత్ర నటుడు అయిన జాయ్ ముఖర్జీ 1989 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించారు.
జయలలిత జననం : తమిలుల అమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన జయలలిత భారత ప్రజలందరికీ కొసమెరుపు . 1948 ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత జన్మించారు. ఎన్నో ఏళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసారూ. రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు తమిళం తెలుగు కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించి... తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది జయలలిత. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి... అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో నటించి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. తనదైన నాట్యంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తమిళ చిత్రసీమను మకుటంలేని మహారాణిగా కొద్దికాలంపాటు జయలలిత ఏలింది అనడంలో అతిశయోక్తి లేదు.. జయలలితను ఆమె అభిమానులు పురచ్చితలైవి అని పిలుచుకుంటారు. తమిళ నటుడు ఎంజీఆర్ సరసన ఎన్నో ఏళ్ల పాటు చిత్రాల్లో నటించిన... ఎంజీఆర్ స్థాపించిన పార్టీలోనే చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. ఇదే క్రమంలో 2016 డిసెంబర్ ఐదవ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది జయలలిత.
నాని జననం : తెలుగు సినీ నటుడు అయిన నాని తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. నాని పూర్తి పేరు నవీన్ బాబు గంటా . నాని 1981 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని. మొదట శ్రీను వైట్ల మరియు బాబు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక కొన్ని రోజులపాటు రేడియో జాకీగా కూడా పని చేసాడు నాని. ఓ వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే సినిమాలో హీరోగా నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఎన్నో సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకున్నాడు నాని. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు నాని. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. మా టీవీలో ప్రసారమైన బిగ్బాస్ 2 షోకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు నాని. 2019 సంవత్సరంలో జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాచురల్ స్టార్ నాని.
శ్రీదేవి మరణం : అందాల తార సినీనటి అయిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24వ తేదీన మరణించారు. తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి ఎంతోమంది ప్రేక్షకులకు అందాల దేవతగా ఉండేది.