చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తుందా.. అయితే కారణం ఇదే కావచ్చు?

praveen
మనలో కొంతమంది చలికాలంలో ఎక్కువగా తలనొప్పి అని చెబుతూ బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తలనొప్పి ఎందుకు వస్తుందో కూడా వారికి అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉంటారు. అయితే దానిని అంత తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలంలో తలనొప్పి రావడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే ఈ రోజుల్లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, ఈ క్రమంలో చలి కారణంగా చాలా మంది బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. దీని కారణంగా శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు పెరిగి, తలనొప్పిని ప్రేరేపిస్తుంది. అంతకాకుండా, ఎండకు ఎక్స్‌పోజ్‌ కాకపోతే.. విటమిన్‌ డి లోపం కూడా ఎదురవుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
అందుకే నిపుణులు ఏం చెబుతున్నారు అంటే? ఉదయం పూట, సాయంత్రం పూట కొంతసేపు ఎండలో తిరగమని అంటున్నారు. అదేవిధంగా మీ డైట్‌లో భాగంగా... విటమిన్‌ డి అధికంగా ఉండే సాల్మన్‌, గుడ్డు పచ్చసొన, అవిసెగింజలు వంటి ఫుడ్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు జరగడం సాధారణం కాబట్టి చలి నుంచి.. వేడిగా ఉండే ఇండోర్ వాతావరణానికి వెళ్లడం వంటివి చేయాలి. అదేవిధంగా ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి.. వాతావరణానికి తగిన దుస్తులు ధరిస్తే ఫలితం బావుంటుంది. విభిన్న వాతావరణాల మధ్య మారుతున్నప్పుడు మీ శరీరాన్ని క్రమంగా అలవాటు చేసుకోవడానికి అనుమతించండి.
సాధారణంగా శీతాకాలం, చల్లటి వాతావరణం కాబట్టి ఎక్కువగా దాహం అనిపించదు. దీంతో చాలామంది నీళ్లు ఎక్కవగా తాగరు. కానీ నీళ్లు అస్సలు తీసుకోకపోతే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలే ప్లాన్ చేసుకోవాలి. హెర్బల్‌ టీలు, వెచ్చని సూప్‌లు మీమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు.. వెచ్చదనాన్ని ఇస్తాయి. శీతాకాలంలో చాలామంది పర్యటనలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా, మ్యూజిక్‌ వినడం వంటివి ప్రాక్టిస్‌ చేస్తే ఉత్తమం. కొందరు ఇంట్లో చలికి తట్టుకోవడానికి ఇండోర్‌ హీటర్లు పెట్టుకుంటూ ఉంటారు. కాస్త డబ్బులు కలిగినవారు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే, ఇవి ఇంటిని వెచ్చగా ఉంచుతాయి, గాలిలోని సహజ తేమను తొలిగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: