షుగర్ తో చింతిస్తున్నారా.. ఈ ఒక్క అకు చాలు..!

Divya
చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య ఏమిటంటే డయాబెటిస్ సమస్య. దీనివల్ల చాలా మంది ఏది తినాలనుకున్న తినలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల అనేక వ్యాధులు శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందుకే చాలామంది మధుమేహాన్ని సైతం అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఆహారం వ్యాయామం చాలా కీలకమని చెప్పవచ్చు. మన శరీరంలో రక్తంలో ఉండేటువంటి చక్కెరను సైతం నియంత్రించడానికి ఎన్నో రకాల వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్లు ఈ షుగర్ ని నియంత్రించడానికి ఆహారంతో పాటు పలు రకాల మూలికలను సైతం ఉపయోగించవచ్చని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.

అలాంటి వాటిలో అరుగులా ఆకులు కూడా ఒకటి. ఈ మొక్క ఆవాల కుటుంబానికి సంబంధించినది. ఈ ఆకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఒక కప్పు ఆకుకూరలు తీసుకుంటే ఇందులో సుమారుగా 25 క్యాలరీలు లభించడమే కాకుండా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ ఫైబర్ వంటివి లభిస్తాయట అంతేకాకుండా విటమిన్లు కూడా లభిస్తాయట. ఈ ఆకుకూరను తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గిస్తాయట. ఇందులో ఉండే ఇన్సులిన్ సెన్సిటివి పెరిగి డయాబెటిస్ రోగులకు సైతం సహాయపడుతుంది.

ఫైబర్ రక్తంలోని చక్కెరను సైతం తగ్గించడానికి సహాయం పడుతుంది. ఈ ఆకులను కూరగాయలుగా ఫ్రై చేసుకుని తినవచ్చు ఇది తినడానికి రుచిగానే ఉన్నప్పటికీ సలాడ్ చేసుకుని తాగడం వల్ల మరింత ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక పచ్చి ఆకును నమ్మడం లేదా ఆ రసాన్ని తాగడం వల్ల మరింత లాభాలు ఉంటాయట. అందుకే పూర్వపు రోజుల్లో చాలామంది ఇలాంటి ఆకులను తినడం వల్ల మధుమేహ సమస్యను పూర్వీకులకు సైతం దరిచేరేది కాదు. మరి ఎవరైనా మధుమేహ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆకును తినడం మంచిది. అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: