ఏ వయసు వాళ్లు ఎంత బరువు ఉండాలో తెలుసా.. ఈ సీక్రెట్తో అనారోగ్యాలన్నీ మాయం..
ఈ రోజుల్లో చాలా మంది పూర్ లైఫ్ స్టైల్, అన్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ కారణంగా చాలా లావు అయిపోతున్నారు. అయితే అధిక బరువు ఉన్నవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి, రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు, చక్కెర వ్యాధి వంటివి. మన వయసుకు తగిన బరువును కలిగి ఉంటే ఈ రకమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే, అధిక బరువు ఉన్న ప్రతి వ్యక్తికీ ఈ సమస్యలు ముప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంది. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని, వ్యాయామం చేస్తే బరువును నియంత్రించుకోవచ్చు.
ఆరోగ్యంగా ఉండాలంటే, మన శరీరానికి సరిపోయే బరువు ఉండాలి. అంటే ఎంత బరువు ఉండాలి అనేది ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటుంది. మన ఎత్తు, వయసు, శరీర నిర్మాణం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మన శరీరానికి కావలసిన బరువు కూడా మారుతుంది. ఉదాహరణకి, 12 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న వారి బరువు సుమారు 32 నుండి 36 కిలోలు ఉండాలి. 15 నుండి 20 సంవత్సరాల వయసు ఉన్న వారి బరువు సుమారు 45 కిలోలు ఉండాలి. అదేవిధంగా 21 - 30 సంవత్సరాల మధ్య వయసున్న వారు 50-60 కిలోలు ఉండటం ఆరోగ్యకరం.
31 - 40 ఏళ్ల వయస్సు వారు 60-65 కిలోలు, 41-60 సంవత్సరాల వయస్సు వారు 59-63 కిలోలు ఉండాలి. వయస్సుతో పాటు బరువు ప్రమాణాలు పెరుగుతాయని ఇది చూపిస్తుంది. ఈ ప్రమాణాలను గుర్తుపెట్టుకుని బరువును హెల్తీ రేంజ్ లో ఉంచుకోవడం అవసరం. ఒకసారి ఏదైనా అనారోగ్యం భారిన పడితే మళ్ళీ దాని నుంచి బయటపడటం చాలా కష్టం. అందుకే చికిత్స కంటే నివారణ మేలు అంటారు కాబట్టి వెయిట్ కంట్రోల్ కోసం కష్టపడాలి. అలాగే బరువు పెరగడానికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్, ఇంకా ఆరోగ్యకరమైన పప్పులు ధాన్యాలను మాత్రమే ఎంచుకోవాలి.