కొంత మంది రోజు మధ్యాహ్నం పూట నిద్ర పోయే అలవాటును కలిగి ఉంటారు . ఇక మరి కొంత మంది నిద్ర పోవాలి అనిపించిన కూడా వారి పరిస్థితి ల ప్రభావం వల్ల నిద్రపోకుండా పని చేయవలసి ఉంటుంది . తిన్న తర్వాత నిద్ర రావడం అనేది ప్రతి మనిషి లోనూ చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది . ఇక ఖాళీ గా ఉన్న వారు మధ్యాహ్నం ఒక కునుకు తీయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు . ఇక మధ్యాహ్నం పూట నిద్రపోవడం వల్ల అసలు ప్రయోజనాలు ఉన్నాయా ... లేక వీటి వల్ల ఎమైనా నష్టాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి చాలా మంది నిపుణులు అనేక పరిశోధనలను చేశారు.
ఇకపోతే కొంత మంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం తిన్న తర్వాత ఒక గంట వరకు నిద్ర పోవడం చాలా మంచిది అని , అలా నిద్ర పోవడం ద్వారా అప్పటివరకు శారీరకంగా కష్టపడిన కష్టాలు అన్ని పోయి ఎంతో రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. కానీ గంట కంటే ఎక్కువ మధ్యాహ్న సమయంలో నిద్రపోయినట్లు అయితే అనేక నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇక నిపుణుల సూచన ప్రకారం మధ్యాహ్నం పూట నిద్రపోవడానికి వెసులు బాటు ఉన్న వ్యక్తులు అర్థ గంట నుండి గంట వరకు మాత్రమే మధ్యాహ్న పూట నిద్రపోవాలి అని అంత కంటే పోవాలి అనుకుంటే మాత్రం వారికి అనేక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే మధ్యాహ్న నిద్ర ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని , అందుకు అర్థ గంట లేదా గంట మధ్యాహ్నం నిద్రపోయి లేచాక పనులు చేసుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.