బాత్ రూమ్ లోనే.. ఎందుకు హార్ట్ ఎటాక్స్ ఎక్కువ.. కారణం ఇదేనట?
ఇందులో మొదటిగా మలబద్ధకం వల్ల శరీరం అధిక ఒత్తిడికి గురవుతుంది. దింతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బాత్ రూంలో తల స్నానం చేసేటప్పుడు రక్త ప్రసరణ వేగంగా పెరగడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఇక శీతాకాలంలో చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. అన్ని వైపుల నుంచి తల భాగం వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. సాధారంణగా రక్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు సంభవించవచ్చు. దింతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో మనలో ఎవరికైనా గుండె సంబంధ రోగులు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు, మలబద్ధకం సమస్య ఉన్నవారు బాత్రూమ్ లకు వెళ్లినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
తరుచు గుండెపోటు రాకుండా ఎలా నివారించవచ్చన్న విషయానికి వస్తే.. ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అలాగే ప్రతి రోజూ కూడా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. అలాగే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే లాగా చూసుకోండి. బాత్ రూంలో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ కూడా వాడకుండా ఉంటె చాల మంచిది. మొబైల్ వాడడం వాళ్ళ కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి.