డేంజర్ బెల్స్ : కూల్ డ్రింక్స్ తాగితే పక్షవాతం వస్తుందా.. వామ్మో?
ఈ ప్రతి విషయంలో ఇన్స్టంట్ అనే పదానికి బాగా అలవాటు పడిపోయాడు మనిషి. ఈ క్రమంలోనే అటు దాహాన్ని తీర్చే కూల్డ్రింక్స్ విషయం లో కూడా ఇలాంటి ఇన్స్టెంట్ రెడీమేడ్ జ్యూసుల పైన ఆధారపడుతూ ఉన్నాడు. నేటి రోజుల్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు. కాస్త దాహం వేసింది అంటే చాలు పండ్ల రసాలు తాగడం మానేసి తమకు ఇష్టమైన కూల్ డ్రింక్స్ తాగటం చేస్తున్నారు. కూల్డ్రింక్స్ హెల్త్ కి అసలు మంచివి కావు అని తెలిసినప్పటికీ.. ఇక కూల్ డ్రింక్స్ తాగే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. కానీ ఎక్కడ తగ్గ ముఖం పట్టడం లేదు.
కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా.. రెడీమేడ్ జూస్ లకు కూడా బాగా అలవాటు పడి పోయాడు మనిషి. ఇక ఇలాంటి జ్యూస్ లతో పక్షవాతం బారిన పడే ముప్పు ఉందని పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే అధిక చెక్కరలు, రిజర్వేటివ్ లు పక్షవాతానికి దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కూల్ డ్రింకులు, రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగిన పక్షవాతం ముప్పు 37% పెరుగుతుందట. బ్లాక్ టీ తాగడం రోజు ఏడు కప్పుల కంటే ఎక్కువ నీరు తాగడం పక్షవాతం ముప్పును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.