AI అద్భుతం.. నిద్రలో కలలని కూడా రీప్లేస్ చేస్తుందట?
మళ్లీ అలాంటి కల వస్తే బాగుండు అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి వచ్చిన కల మళ్లీ వస్తుందా లేదా అని చెప్పడం మాత్రం చాలా కష్టమే. కానీ ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది అన్నది తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఏఐ టెక్నాలజీ మనిషి జీవితంలో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అటు మనిషి డ్రీమ్స్ విషయంలో కూడా మరో అద్భుతం చేయబోతుందట ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ. ఏకంగా నిద్రలో వచ్చే డ్రీమ్స్ ని మళ్లీ రిపీట్ చేయడానికి ఏఐ ద్వారా అవకాశం ఉంటుందట.
అందుకే ఇక మంచి కల డిస్టబ్ అయ్యింది అని ఇక ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదట. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్ ఏఐ సాంకేతికతల సహాయంతో జపాన్ పరిశోధకులు రూపొందించారట. అయితే పరిశోధనలో పాల్గొన్న వారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి ఏకంగా 60% ఖచ్చితత్వం వచ్చిందని పరిశోధకులు చెప్పుకొచ్చారు. ఇక రానున్న రోజుల్లో 100% ఖచ్చితత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే నిద్రలో వచ్చే డ్రీమ్స్ ని కూడా రిప్లై చేయడం అంటే ఇది నిజంగా అద్భుతమే కదా.