తస్మాత్ జాగ్రత్త.. ఆ డైట్ తో గుండెకు ప్రమాదం?
ఇక నేటి రోజుల్లో చేసే ఉద్యోగాలన్నీ ఒకే చోట గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు కావడం.. ఇంకోవైపు ఇక అటు పిజ్జాలు బర్గర్లు అంటూ ఆహారపు అలవాట్లు మారిపోవడం వెరసి ఇక ఎంతోమంది బరువు పెరిగిపోయి.. ఊబ కాయూలుగా మారిపోతున్నారు చివరికి బరువును తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొంతమంది జిమ్ కు వెళ్లి వర్కౌంట్లో చేస్తూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ఆహారం విషయంలో డైట్ ఫాలో అవుతూ ఉన్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కో రకమైన డైట్ ఫాలో అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటిలో బాగా ఫేమస్ అయిన డైట్ ఏది అంటే కీటో డైట్ అని చెప్పాలి.
కీటో డైట్ ఫాలో అవడం వల్ల ఎంతో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ ఇలాంటి డైట్ అసలు ఆరోగ్యానికి మంచిదే కాదు అంటూ చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు సహాయపడే కీటో డైట్ గుండె పొట్టకు అంత మంచిది కాదని.. సెల్ రిపోర్ట్ మెడిసిన్ లో పబ్లిష్ అయిన కొత్త స్టడీ పేర్కొంది. దానికన్నా లోషుగర్ డైట్ ఎంతో బెటర్ అంటూ తెలిపింది. కీటో వల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుందట. మైక్రో బయోమ్ దెబ్బతింటుందట. ఎక్కువ కొవ్వు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. అంతే కాకుండా గుండె జబ్బులకు దారి తీసే అపో లిపో ప్రోటీన్ పెరగడాన్ని మూత్రంలో గమనించాం అంటూ నిపుణులు చెబుతున్నారు.