ఈ సమస్య ఉన్నవారు వయాగ్రా వేసుకున్నారో.. ఇక అంతే సంగతులు?

praveen
వయాగ్రా.. నేటిరోజుల్లో ఈ పేరు గురించి తెలియని మనిషి లేడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనుషుల యొక్క శృంగార సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వయాగ్రా వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక లైంగిక సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది తరచూ ఈ వయాగ్రా టాబ్లెట్లను ఉపయోగించడం చేస్తూ ఉంటారు. అయితే ఇది మొదట్లో అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగపడింది. ఈ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ పెంచి జననేంద్రియ ప్రాంతంలో ఒత్తిడిని పెంచుతుంది.

 ఆ తర్వాత కాలంలో మాత్రం ఎంతోమంది శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు వయాగ్రాన్ని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వయాగ్రా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో కంపెనీలు దీనిని తయారు చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే వయాగ్రా వేసుకోవడం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అని అట్టు వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. కాగా భోజనానికి అరగంట ముందు లేదంటే రెండు గంటల తర్వాత వయాగ్రా తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నిపుణుల సలహాతో మాత్రమే వయాగ్రా వాడాలి.

 పురుషుల్లో అంగస్తంభన నపుంసకత్వ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇక పురుషులే వీటిని వాడాలి. ఆడవాళ్లు అస్సలు వాడకూడదు అంటూ వైద్యులు చెబుతున్నారు. సెక్స్ లైఫ్ ఆనందంగా ఉంటుంది కదా అని అందరూ వయాగ్రా వాడకూడదు అని హెచ్చరిస్తున్నారు. అలర్జీ ఉన్న వ్యక్తులు అసలు వయాగ్రా తీసుకోకూడదట. ఛాతి నొప్పికి నైట్రేట్ మందులు వాడేవారు కూడా వయాగ్రాకి దూరంగానే ఉండాలట. గుండె మరియు కాలేయా వ్యాధి ఉన్న రోగులు కూడా వయాగ్రా జోలికి పోకూడదట. ఇక అధిక రక్తపోటు ఉన్న రోగులకు కూడా ఇది అస్సలు మంచిది కాదట. అరుదైన జన్యుపరమైన కంటి వ్యాధులు లుకేమియా,  మల్టిపుల్ మైలోమా లాంటి రక్త క్యాన్సర్లు ఉన్న రోగులు కూడా వయాగ్రా తీసుకోకూడదు అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు. అంతేకాకుండా జననేంద్రియ వైకల్యాలు ఉన్న వ్యక్తులు కడుపు పూతలతో బాధపడుతున్న పురుషులు సైతం వీటికి దూరంగానే ఉండాలట. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు వయాగ్రా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. కొన్ని కొన్ని సార్లు ఏకంగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: