చిన్నపిల్లలకు నూడిల్స్ తినిపిస్తున్నారా.. ఇది తెలుసుకోండి?

praveen
ఒకప్పుడు బయట ఎన్ని హోటల్లు  ఉన్నా ఇంటి భోజనం తినడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని కనపరిచేవారు. అంతే కాదు ఇంటి భోజనం తినడాన్ని ఒక అదృష్టంగా భావించేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం అందరి ఆలోచన తీరు మారిపోయింది. భార్య చేసిన వంటను ఎంతో ఇష్టంగా తినే భర్తలు కనిపించడం లేదు. భర్త కోసం ఇష్టంగా వండి పెట్టే భార్యలు కనిపించడం కనిపించడం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి నచ్చింది తినేవారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. కొంతమంది అయితే ఆన్లైన్లో ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.

 ఇలా ప్రతి ఒక్కరు కూడా పౌష్టికాహారం కాదు మసాలాలు దట్టించి నోటికి రుచిగా ఉంటే చాలు వావ్ అదిరిపోయింది అని లొట్టలేసుకుంటూ తింటూ ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. ఇలా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లలో భాగంగా మారిపోయిన వాటిలో నూడిల్స్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. చాలామంది తరచుగా నూడిల్స్ తినడం చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు కూడా నూడిల్స్ పెడుతూ ఉంటారు. పిల్లలు కూడా ఇక ఈ నూడిల్స్ ని ఇష్టంగా తినడం చూస్తూ ఉంటాం కానీ ఈ నూడిల్స్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు

 ఇప్పటికైనా నూడిల్స్ తినడం మానుకోవడం మంచిది అంటూ ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రమోటర్ బార్బర్ ఓ నీల్ చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ ఆహారం అందించడానికి ఆపేయాలి అంటూ హెచ్చరించారు నూడిల్స్ లో పోషకాలు శూన్యమని గోధుమ సింథటిక్ కార్బోజేనెటిక్ స్వభావం ఉంటుందని అందుకే నూడిల్స్ తినడం వల్ల కడుపులో మంటగా ఉంటుందని ఇక రాములమ్మ జీర్ణశక్తి కూడా మందగిస్తుంది అంటూ నిపుణులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: