ఏంటి.. పానీపూరి తినడం వల్లే.. అమ్మాయిల్లో ఆ సమస్య వస్తుందా?

praveen
పానీ పూరి.. ఈ పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరి నోట్లో ఊరిలు వచ్చేస్తూ ఉంటాయి. అంతలా ఫేమస్ అయిపోయింది ఈ ఫుడ్. అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే పానీపూరి రుచిలో కూడా అన్ని రకాల ఆహారాలను మరిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇక పానీపూరి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పానీ పూరికి ఫ్యాన్స్ ఉంటారు.

 ఈ పానీ పూరి అమ్మే బండ్లు ఏకంగా మురికి కాలువల పక్కన ఉన్న.. చుట్టూ అంత అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా ఏకంగా పానీపూరి లాగించేస్తూ ఉంటారు అందరూ. మరి ముఖ్యంగా మహిళలకు పానీ పూరి అంటే ఎంత ఇష్టం ఉంటుందో మాటల్లో కూడా చెప్పలేం. అందుకే మహిళలకు ఇక ఈ ఆహారంపై ఉండే ఇష్టం తెలియజేసేలా సోషల్ మీడియాలో ఎన్నో మీన్స్ కూడా పుట్టుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పాని పూరి అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం. మరీ ముఖ్యంగా మహిళలకు పానీపూరి తినడం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

 ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా బాధపడుతున్న ఆరోగ్య సమస్యల్లో  పిసిఒడి సమస్య కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. మహిళల్లో ఈ సమస్య రోజురోజుకు అధికమవుతుంది తప్ప తగ్గు ముఖం పట్టడం లేదు. అయితే ఈ సమస్యకు కూడా పానీ పూరి తినడమే కారణం అంటూ నిపుణులు గుర్తించారు. అమ్మాయిలు రోజు పానీ పూరి తింటూ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. దీనివల్ల అమ్మాయిల్లో పిసిఒడి సమస్యలు అధికమవుతున్నట్లు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, బరువు పెరగడం పెదాలపై రోమాలు పెరగడం సమస్యలు పానీ పూరి తింటున్న అమ్మాయిల్లో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పానీపూరీలో నీరు హైజినిక్ గా ఉండకపోతే టైఫాయిడ్ బారిన పడే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: